Mahesh Babu Birthday : కొన్ని వేల మంది చిన్నారుల గుండె చప్పుడు మహేష్ అంటున్న ఫ్యాన్స్

మహేష్ సినిమా అయినా, ఆయన బర్త్ డే అయినా ఫ్యాన్స్ కు పెద్ద పండగ అనే చెప్పాలి...

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఆ పేరులో వైబ్రేషన్ ఉంది. ఆ పేరులో మత్తుంది.. ఆ పేరుకు ఓ రేంజ్ ఉంది. మహేష్ బాబు కటౌట్ కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేడు ఆ ఆరడుగుల అందగాడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు. మంచి మనసున్నోడు అంతకు మించి భారీ అభిమానులున్నోడు.. నటనలో నయా స్టైలున్నోడు మన మహేష్ బాబు(Mahesh Babu). తండ్రికి తగ్గ తనయుడు అన్నదానికి నిదర్శనం మహేష్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మహేష్ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.

తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. ఎంత సూపర్ స్టార్ అయినా చాలా సింపుల్ గా ఉంటారు మహేష్(Mahesh Babu). ఎలాంటి వివాదాల జోలికి పోకుండా తన సినిమాలు తాను చేసుకుంటూ అభిమానులను అలరిస్తున్నాడు మహేష్. నేడు మహేష్ పుట్టిన రోజు సందర్భంగా అభిమాను సంబరాలు జరుపుకుంటున్నారు. ఇప్పటికే నెల రోజుల ముందు నుంచి మహేష్ అభిమానులు సందడి చేస్తున్నారు.

Mahesh Babu Birthday Celebrations

మహేష్ సినిమా అయినా, ఆయన బర్త్ డే అయినా ఫ్యాన్స్ కు పెద్ద పండగ అనే చెప్పాలి. ఏ ఏరియా చూసిన జాతర వాతావరణం కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ .. విదేశాల్లోనూ మహేష్ బాబు ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మహేష్ కొటౌట్స్ కు పూలాభిషేకాలు, పాలాభిషేకాలు, రక్తదానాలు, అన్నదానాలు అంటూ తమ హీరో పై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు ఫ్యాన్స్. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఇప్పుడు మహేష్ బాబు ఫోటోలు మాత్రమే కనిపిస్తున్నాయి. మహేష్ ఎంత పెద్ద హీరోనో అంత మంచి మనసున్న మనిషి.. ఇప్పటికే వేల చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించాడు. వేల చిన్నారుల గుండె చప్పుడు మా మహేష్ బాబు.. అంటూ ఫ్యాన్స్ ఆనందంలో తేలిపోతుంటారు. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

Also Read : Bhagyashri Borse : నెక్స్ట్ ఇండస్ట్రీ నెంబర్ 1 భాగ్యశ్రీ అంటున్న నెటిజన్లు

BirthdayMahesh BabuTrendingUpdatesViral
Comments (0)
Add Comment