Kalki 2898 AD Trailer : కల్కి ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది....

Kalki 2898 AD: ప్రస్తుతం కల్కి 2898 ఎ డి.. టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ పాన్-ఇండియన్ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ తారలు దీపికా పదుకొణె, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. లోకనాయక్ కమల్ హాసన్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం వైజయంతీ మూవీస్‌ పతాకంపై రూ.600 కోట్ల బడ్జెట్‌తో నిర్మాత అశ్వినీదత్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టీజర్‌లు, ఇన్‌సైట్‌లు, పోస్టర్‌లతో ఇప్పటికే అంచనాలను పెంచేసింది చిత్రయూనిట్. సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు భైరవుడి స్నేహితుడిగా నటించిన బుజ్జి అనే రోబో కారును మేకర్స్ ఇటీవలే పరిచయం చేశారు. ఇప్పుడు దేశంలోని పలు నగరాల్లో కల్కి ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

Kalki 2898 AD Trailer Updates

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇది తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళంలో రానుంది. సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా, “బుజ్జి” మరియు “భైరవ” అనే యానిమేషన్ సిరీస్‌లు OTTలో అందుబాటులో ఉంటాయి. కల్కికి రెండేళ్ల ముందు భైరవ, బుజ్జి ఎలా కలిశారు. వీరిద్దరి మధ్య బంధం ఎలా బలపడుతుందనేది ఈ సినిమాలో తెలియజేస్తుంది. ప్రస్తుతం, “బుజ్జి” మరియు “భైరవ” అనే యానిమేషన్ సిరీస్‌లు OTTలో ప్రసారం అవుతున్నాయి. ఇప్పుడు ట్రైలర్‌ని విడుదల చేసే పనిలో పడ్డారు మేకర్స్.

తాజా సమాచారం ప్రకారం కల్కి 2898 ఏ డి(Kalki 2898 AD) ట్రైలర్ జూన్ 7న విడుదల కానుందని.. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. భారతీయ ఇతిహాసం ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీపై చాలా ఉత్కంఠ నెలకొంది. విజువల్ ఎఫెక్ట్స్, మెరిసే యాక్షన్ సన్నివేశాలతో పాటు ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినిమా రియల్ బ్లాక్ బస్టర్ అని సూచిస్తున్నాయి. మరి త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.

Also Read : Mission C 1000 : కొత్త సినిమా మెలోడీ సాంగ్ పోస్టర్ ను విడుదల చేసిన నిర్మాత

Kalki 2898 ADTrailer releaseTrendingUpdatesViral
Comments (0)
Add Comment