Beauty Malaika Arora :ఐపీఎల్ లో త‌ళుక్కుమ‌న్న మ‌లైకా అరోరా

క్రికెట్ లెజండ్ కుమార సంగ‌క్క‌ర‌తో జ‌త

Malaika Arora : ఇండియాలో క్రికెట్ ఆట‌కు ఉన్నంత ఆద‌ర‌ణ ఇంకే రంగానికి లేదు. అందుకే వ్యాపార‌, వాణిజ్య‌, సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖులంతా క్రికెట్ తో పాటు క్రికెట‌ర్ల‌తో స‌త్ సంబంధాలు క‌లిగి ఉండేందుకు ఇష్ట ప‌డ‌తారు. చాలా మంది ప్లేయ‌ర్ల‌తో డేటింగ్ కూడా చేశారు. అమృతా సింగ్ తో ర‌వి శాస్త్రి, సంగీతా బిజ్ లానీతో మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్ ..నీనా గుప్తా వివ్ రిచ‌ర్డ్స్ తో..ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. వీరంతా త‌మంత‌కు తాముగా ప్ర‌మోట్ చేస్తున్నారు. సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా నిలుస్తున్నారు.

Malaika Arora Viral

తాజాగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ 2025 టాటా సంస్థ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ఇప్ప‌టికే 10 జ‌ట్లు త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించు కోనున్నాయి. ఇదిలా ఉండ‌గా శ్రీ‌లంక మాజీ కెప్టెన్ , ప్ర‌స్తుత రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు డైరెక్ట‌ర్ గా ఉన్న కుమార సంగక్క‌ర ఆస‌క్తిని రేకెత్తించేలా మారాడు. ఆయ‌న‌తో పాటు బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా పేరొందిన మ‌లైకా అరోరా(Malaika Arora) త‌ళుక్కున మెరిసింది. ఆమె రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుతో ఏమైనా ఒప్పందం కుదుర్చుకుందా లేక బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఏమైనా చేస్తుందా అన్న‌ది తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉండ‌గా గౌహ‌తి వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్ తో జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ చివ‌రి దాకా పోరాడింది. 6 ప‌రుగుల తేడాతో తొలి విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన మూడు మ్యాచ్ ల‌లో ఒక‌టి మాత్ర‌మే గెలిచింది. తొలి మ్యాచ్ లో 46 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ తో . రెండో మ్యాచ్ ను 11 ప‌రుగుల తేడాతో ఓడించింది కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్. దీంతో అస‌లు జ‌ట్టు గెలుస్తుందా అన్న అనుమానం రేకెత్తింది. ఉన్న‌ట్టుండి మ్యాచ్ గెల‌వ‌డంతో రాజ‌స్థాన్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

Also Read : Popular Actress Vidya Balan :బోయ‌పాటి శ్రీ‌ను మూవీలో విద్యా బాల‌న్

IPL 2025Malaika AroraUpdatesViral
Comments (0)
Add Comment