Nayanthara : నయనతార పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆ ప్రముఖ నటి

ఇదిలా ఉంటే, మమతా మోహన్‌దాస్ పాత ఇంటర్వ్యూ మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది...

Nayanthara : నయనతార, ధనుష్ వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన నయనతార, ధనుష్ గురించే మాట్లాడుకుంటున్నారు. కొంతమంది నయనతార(Nayanthara)కు మద్దతు తెలుపుతుంటే.. మరికొంతమంది ధనుష్ కు సపోర్ట్ చేస్తున్నారు.రీసెంట్ గా ఓ పెళ్లిలో ఈ ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా కనిపించారు. ధనుష్‌కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో నయనతార బహిరంగ లేఖ విడుదల చేయడంతో సమస్య మొదలైంది. నయనతార(Nayanthara) పెళ్లి డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’లో నానుమ్ రౌడీ థాన్‌లోని కొన్ని సన్నివేశాలను ఉపయోగించుకోవడానికి ధనుష్ ఎన్‌ఓసి ఇవ్వలేదని నయన్ ఆరోపించింది. ధనుష్ తనపై, తన భర్త విఘ్నేష్ శివన్‌పై కొన్నేళ్లుగా పగ పెంచుకుంటున్నాడని ఆమె ఆరోపించింది. చాలా మంది నయనతారకు అనుకూలంగా, మరికొంతమంది వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు , కామెంట్స్ చేస్తున్నారు.

Nayanthara…

ఇదిలా ఉంటే, మమతా మోహన్‌దాస్ పాత ఇంటర్వ్యూ మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకుముందు ఓ ఇంటర్వ్యూలో, రజనీకాంత్ నటించిన సినిమా నుంచి తన పార్ట్‌లను తొలగించారని. తెలిపింది. ఆ సినిమాలో నటించిన స్టార్ హీరోయిన్ తన పార్ట్ ను తీసేసింది అని మమత తెలిపింది. దాంతో ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. చాలా మంది నెటిజన్స్ నయనతారను ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు.

మమతామోహన్ దాస్ మాట్లాడుతూ.. “రజనీ సర్‌ సినిమాలో ఓ పాట చేయాలని నన్ను పిలిచారు. ఈ పాటను 45 రోజుల్లో చిత్రీకరించారు. కానీ అది బయటకు వచ్చేసరికి అందులో నా పార్ట్‌ ఏమీలేదు. ఆ పాటలో మరో నటి నటిస్తుంటే తాను నటించనని ఆ సినిమాలోని హీరోయిన్ చెప్పిందని తర్వాత తెలిసింది. ఎంతో కష్టపడి చేశాను. నా మూడు నాలుగు రోజులు వృధా అయ్యాయి. సినిమా వచ్చినప్పుడు అందులో నా బ్యాక్ షాట్ మాత్రమే ఉంది. పాటలో ఒక చివర మాత్రమే కనిపించాను. అది చూసినప్పుడు చాలా డిజప్పాయింట్‌గా అనిపించింది’’ అని మమత అన్నారు.దాంతో మమత చెప్పింది నయన్ గురించే అని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Hero Ajith Kumar : తన భార్యకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన హీరో అజిత్

BreakingCommentsNayantharaViral
Comments (0)
Add Comment