Hero Manchu Vishnu : నిత్యం శివ నామ స్మ‌ర‌ణ చేస్తున్నా

ఒక‌ప్పుడు ఆంజ‌నేయ స్వామి భ‌క్తుడిని

Manchu Vishnu : అంద‌రి క‌ళ్లు ఇప్పుడు క‌న్న‌ప్ప చిత్రంపైనే ఉన్నాయి. భారీ ఖ‌ర్చుతో డాక్ట‌ర్ మంచు మోహ‌న్ బాబు ఫ్యామిలీ నుంచి వ‌స్తున్న మూవీ కావ‌డం విశేషం. ఇప్ప‌టికే టీజ‌ర్, సాంగ్స్ విడుద‌ల చేశారు. మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ఇందులో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు ప్యాన్ ఇండియా హీరో డార్లింగ్ ప్ర‌భాస్. ఈ చిత్రానికి త‌ను ప్ల‌స్ పాయింట్ కానున్నాడు. అంతే కాదు బాలీవుడ్ స్టార్స్ అక్ష‌య్ కుమార్, కాజ‌ల్ అగ‌ర్వాల్ తో పాటు మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ తో పాటు టాలీవుడ్ కింగ్ మోహ‌న్ బాబు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌డంతో క‌న్న‌ప్ప పై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.

Manchu Vishnu Comments

ఇదే స‌మ‌యంలో మంచు విష్ణు(Manchu Vishnu) కీ రోల్ పోషిస్తున్నాడు. ఇది పూర్తిగా త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఇప్ప‌టికే ప్ర‌క‌టించాడు. దీంతో క‌న్న‌ప్ప(Kannappa) మూవీ ప్ర‌మోష‌న్స్ పై ఫోక‌స్ పెట్టాడు. అవా ఎంట‌ర్ టైన్మెంట్స్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ బ్యానర్ పై మోహ‌న్ బాబు దీనిని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇందులో భాగంగా క‌న్న‌ప్ప మూవీ బృందం తాజాగా జ‌రిగిన రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ లో పాల్గొంది.

ఈ సంద‌ర్బంగా మంచు విష్ణు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. తాను సినిమా తీయ‌క ముందు ఆంజ‌నేయ స్వామికి అప‌ర భ‌క్తుడిగా ఉండేవాడిన‌ని, కానీ సినిమా చేయ‌డం, దానిలో లీనం కావ‌డంతో తాను ఇప్పుడు పూర్తిగా శివ భ‌క్తుడిగా మారి పోయాన‌ని చెప్పాడు. ప్ర‌తి రోజూ శివ నామ స్మ‌ర‌ణ చేస్తున్నాన‌ని పేర్కొన్నాడు. తాజాగా మంచు విష్ణు చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి. ఇప్ప‌టికే త‌న‌కు సంబంధించిన పోస్ట‌ర్స్, సాంగ్స్ కెవ్వు కేక అనిపించేలా ఉండ‌డంతో భారీ ఎత్తున స‌క్సెస్ కావ‌డం ఖాయ‌మ‌నే ధీమాను వ్య‌క్తం చేస్తున్నారు మోహ‌న్ బాబు.

Also Read : Robinhood vs Mad 2 Sensational @రాబిన్ హుడ్..మ్యాడ్ 2 నువ్వా నేనా

CommentsKannappaManchu VishnuViral
Comments (0)
Add Comment