Kannappa Movie : ‘కన్నప్ప’ లో బాలనటుడిగా మంచు విష్ణు వారసుడు..

మంచు విష్ణు టైటిల్‌ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు...

Kannappa : మంచు కుటుంబం నుంచి మరోతరం అలరించడానికి సిద్దమవుతోంది. మంచు విష్ణు కుమారుడు అవ్రామ్‌ ‘కన్నప్ప(Kannappa)’లో ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. సోమవారం కృష్ణాష్టమి సందర్భంగా అవ్రామ్‌ లుక్‌ విడుదల చేశారు. ఇందులో అతను ‘తిన్నడు’గా నటించనున్నట్లు తెలిపారు. మంచువిష్ణు చిన్నప్పటి పాత్రను అవ్రామ్‌ పోషించనున్నాడు. ఈ పోస్టర్‌ను మోహన్‌ బాబు పోస్ట్‌ చేసి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు చెప్పారు. అవ్రామ్‌కు ఇది తొలి సినిమా కావడంతో మంచు అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా విష్‌ చేస్తున్నారు.

Kannappa Movie Updates

మంచు విష్ణు టైటిల్‌ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. ప్రీతి ముకుందన్‌ కథానాయిక. ప్రభాస్‌, అక్షయ్‌ కుమార్‌, శరత్‌కుమార్‌, మోహన్‌లాల్‌, మధుబాల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్‌ దాదాపుగా పూర్తయింది. ఇటీవల టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం గురించి మంచు విష్ణు మాట్లాడుతూ ‘‘ఇది నా కలల సినిమా. నా బిడ్డతో సమానం. ఒక నటుడిగా ఈ చిత్రం నాకు గౌరవాన్ని పెంచుతుంది. కెరీర్‌ పరంగా నా జీవితాన్ని మార్చేస్తుంది. ఇందులో చాలామంది అగ్ర నటీనటులు ఉన్నారు. వాళ్లందరితో కలిసి నటించడం నాకు దక్కిన అదృష్టం. భక్తుడు కాక ముందు కన్నప్ప ఎలా ఉండేవారో అలా నటించడం సవాల్‌గా అనిపించింది’’ అని అన్నారు.

Also Read : Hero Mahesh Babu : ‘ముఫాసా’ కి డబ్బింగ్ చెప్పడం చాలా ప్రత్యేకం

CinemaKannappaManchu VishnuTrendingUpdatesViral
Comments (0)
Add Comment