అమరావతి – సీనియర్ జర్నలిస్ట్, సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాస రావుకు మంగళగిరి కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. 14 రోజుల రిమాండ్ విధించింది. వైద్య పరీక్షలు అనంతరం జిల్లా జైలుకు తరలించారు పోలీసులు. ఇదిలా ఉండగా వేశ్యల రాజధాని అనే ట్యాగ్ లైన్ తో సాక్షి ఛానల్ లో మనోడు బిగ్ డిబేట్ నిర్వహించారు. ఈ చర్చలో భాగంగా విజయవాడకు చెందిన కృష్ణం రాజు అనే అనలిస్ట్ రెచ్చి పోయాడు.
అమరావతి రాజధాని మహిళా రైతులను ఉద్దేశించి సభ్య సమాజం తల దించుకునేలా కామెంట్స్ చేశాడు. ఛానల్ ఉంది కదా అని నోరు జారుతున్నా డిబేట్ నిర్వహిస్తున్న కొమ్మినేని శ్రీనివాస రావు తన వ్యాఖ్యలను మరింత ఖండించక పోవడం విస్తు పోయేలా చేసింది. రోజు రోజుకు ఇరు తెలుగు రాష్ట్రాలలో జర్నలిజం విలువలు మరింత దిగజారేలా ఉంటున్నాయి.
ఏకంగా రాజధాని మహిళలను ఉద్దేశించి కృష్ణం రాజు వేశ్యల రాజధాని అంటూ నోరు పారేసుకున్నాడు. దీంతో యాంకర్ , డిబేట్ నిర్వహిస్తున్న కొమ్మినేని శ్రీనివాస రావుపై గుంటూరు జిల్లా తూళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు ఇద్దరిపై. నిన్న హైదరాబాద్ లో తన నివాసంలో ఉన్న కొమ్మినేని శ్రీనివాస్ రావును అదుపులోకి తీసుకున్నారు.
కోర్టులో హాజరు పర్చారు. ఈ సందర్బంగా వాదనలు కొనసాగాయి. జడ్జి ముందు తనకు 70 ఏళ్ల వయసు అని, తనకు వేరే బెడ్ కావాలని కోరారు కొమ్మినేని శ్రీనివాస రావు. దీనికి న్యాయమూర్తి ఒప్పుకోలేదు. అందరికీ ఇచ్చినట్టే మీకు ఇస్తారని పేర్కొన్నారు. ఆయన తరపున సీనియర్ లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.
ఇదిలా ఉండగా కించ పరిచేలా మాట్లాడిన కృష్ణం రాజును అరెస్ట్ చేసేందుకు వెళ్లగా విజయవాడలో తన ఇంటికి తాళం వేసి ఉంది. తప్పించుకు తిరుగుతున్న తనను అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.