Kamal Haasan- Thug Life :థ‌గ్ లైఫ్ ఆడియో రిలీజ్ వాయిదా

ఆర్ కెన్ వెయిట్ ఇండియా క‌మ్స్ ఫ‌స్ట్

Thug Life : సుదీర్ఘ కాలం త‌ర్వాత మ‌ణిర‌త్నం , క‌మ‌ల్ హాస‌న్ కాంబోలో వ‌స్తున్న చిత్రం థ‌గ్ లైఫ్(Thug Life). 12 ఏళ్ల గ్యాప్ త‌ర్వాత త్రిష కృష్ణ‌న్, సిలాంబ‌ర‌స‌న్ క‌లిసి న‌టిస్తుండ‌డంఈ మూవీ ప్ర‌త్యేక‌త‌. ఈ సినిమాకు క‌థతో పాటు ఓ పాట కూడా రాశాడు క‌మ‌ల్ హాస‌న్. ఇక ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు హైలెట్ కానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, పోస్ట‌ర్స్, ట్రైల‌ర్, సాంగ్స్ కు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఆడియో కార్య‌క్ర‌మాన్ని లాంఛ్ చేయాల‌ని అనుకున్నారు. కానీ ప్ర‌స్తుతం భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్నాయి. దీంతో వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు మూవీ మేక‌ర్స్.

Kamal Haasan Thug Life Movie Updates

ఆర్ట్ కెన్ వెయిట్ ఇండియా క‌మ్స్ ఫ‌స్ట్ అని క‌మ‌ల్ హాస‌న్ స్ప‌ష్టం చేశారు. ఇది త‌న‌కు దేశం ప‌ట్ల‌, ఈ భూమి ప‌ట్ల ఉన్న మ‌మ‌కారం ఏపాటిదో తెలియ చేస్తుంది. ఇటీవ‌ల చోటు చేసుకున్న ప‌రిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈవెంట్ ను వాయిదా వేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపాడు అగ్ర న‌టుడు. ఇక మ‌ణిర‌త్నంతో క‌లిసి క‌మ‌ల్ 38 ఏళ్ల కింద‌ట నాయ‌కుడు తీశాడు. ఆ త‌ర్వాత వీరిద్ద‌రూ వ్య‌క్తిగ‌తంగా క‌లుసుకున్నా ఎందుక‌నో సినిమా తీయ‌లేదు. చాన్నాళ్ల త‌ర్వాత థ‌గ్ లైఫ్ తో తిరిగి క‌లుసుకున్నారు. ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు.

వాస్తవానికి మే 16న ఆడియో లాంచింగ్ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. కానీ సైనికులు స‌రిహ‌ద్దులో ప్రాణాల‌కు తెగించి పోరాడుతున్నారు. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితిలో సినిమా ఆడియా లాంచ్ చేయ‌డం మంచిది కాద‌ని త‌న‌కు అనిపించింద‌ని అన్నాడు క‌మ‌ల్ హాస‌న్. అందుకే త‌ర్వాత తేదీ ప్ర‌క‌టిస్తామ‌ని సామాజిక మాధ్య‌మం ద్వారా స్ప‌ష్టం చేశాడు . ఇక థ‌గ్ లైఫ్ లో క‌మ‌ల్, త్రిష‌, శింబుతో పాటు జోజు జార్జ్, అశోక్ సెల్వ‌న్, అభిరామ్ ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. మూవీలో క‌మ‌ల్ హాస‌న్ రంగ‌రాయ శ‌క్తి వేల్ నాయ‌క‌న్ అనే పాత్ర‌ను పోషిస్తున్నాడు.

Also Read : Hero Vijay Sethupathi-Rukmini :విజ‌య్ రుక్మిణి వ‌సంత్ ఏస్ ట్రైల‌ర్ రిలీజ్

CinemaKamal Haasanthug lifeUpdatesViral
Comments (0)
Add Comment