Thug Life : దర్శక ధీరుడు మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రం థగ్ లైఫ్(Thug Life). దీనికి కథ అమర్చాడు స్టార్ హీరో కమల్ హాసన్. అంతే కాదు ఓ పాటను కూడా రాశాడు. దీనికి అద్భుతమైన స్వరాలు కూర్చాడు ఆస్కార్ అవార్డు విన్నర్ అల్లా రఖా రెహమాన్. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ దుమ్మ రేపుతున్నాయి. 30 ఏళ్లకు పైగా గ్యాప్ తర్వాత దర్శక ధీరుడుతో కమల్ జత కట్టారు. ఇటీవలే రిలీజ్ అయిన జింగుచా సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. మిలియన్స్ వ్యూస్ తో హల్ చల్ చేస్తోంది.
Thug Life Movie Success Talk
థగ్ లైఫ్ చిత్రంలో కమల్ హాసన్ తో పాటు అందాల ముద్దుగుమ్మ త్రిష కృష్ణన్, సిలాంబరసన్ కీ రోల్స్ పోషిస్తున్నారు. మాఫియా నేపథ్యంగా సాగుతోంది. ఇది పూర్తిగా గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు మణిరత్నం. గతంలో కొన్నేళ్ల కిందట వచ్చిన నాయకుడు సంచలనం రేపింది. కాసుల వర్షం కురిపించింది. సుదీర్గ ఎడబాటు తర్వాత ఇలయ నాయకన్ కమల్ తో జతకట్టాడు మరోసారి మణిరత్నం సర్.
ఆనాడు వచ్చిన నాయకుడులో కూడా ముంబై మాఫియా నేపథ్యంగా సాగింది. ఆనాడు ఆ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించగా ఈసారి థగ్ లైఫ్ కు ప్రాణం పెట్టి సంగీతం, స్వరాలు కూర్చాడు ఏఆర్ రెహమాన్. ఎమోషన్స్, సస్పెన్స్, థ్రిల్లర్ నేపథ్యంగా చిత్రీకరించే ప్రయత్నం చేశానని తెలిపాడు మణిరత్నం . ఇక దాదాపు 12 ఏళ్ల గ్యాప్ తర్వాత త్రిష కృష్ణన్, సిలాంబరసన్ కలిసి నటిస్తుండడం విశేషం. మొత్తంగా థగ్ లైఫ్ మూవీ భారీ అంచనాలు నెలకొనడం విశేషం.
Also Read : Hero Prabhas-Anushka :వంగా ప్రభాస్ మూవీలో అనుష్క శెట్టి