Mathu Vadalara 2: సింగర్‌ గా అవతారం ఎత్తిన జాతిరత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా !

సింగర్‌ గా అవతారం ఎత్తిన జాతిరత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా !

Mathu Vadalara 2: ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్‌ కీరవాణి తనయుడు శ్రీసింహా హీరోగా అరంగేట్రం చేసిన చిత్రం ‘మత్తు వదలరా‘. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా 2019లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దీనితో ఈ సినిమాకు సీక్వెల్‌ గా ‘మత్తు వదలరా 2(Mathu Vadalara 2)’ ను తెరకెక్కిస్తున్నారు. రితేశ్‌ రానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ లో ఫరియా అబ్దుల్లా కీలక పాత్రలో పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమాను సెప్టెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకురానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈనేపథ్యంలో తాజాగా దీని టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈసందర్భంగా మీడియాతో మూవీ టీమ్‌ ముచ్చటించింది.

Mathu Vadalara 2 Movie Updates

ఈ సందర్భంగా ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ… ‘‘నేను వర్క్‌ చేసిన టీమ్‌లలో ఇది బెస్ట్. షూటింగ్ చాలా సరదగా జరిగింది. ఈ సినిమా కోసం నేను ఓ పాట రాశాను. దాన్ని నేనే పాడి కొరియోగ్రఫీ చేశాను. కొత్తగా ఉంటుంది. ఎంజాయ్‌ చేస్తారు’’ అని ఫరియా అన్నారు.

‘‘మత్తు వదలరా’తో నేను ఇండస్ట్రీకి వచ్చాను. 5 ఏళ్ల తర్వాత దాని సీక్వెల్‌కు వర్క్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సినిమాలు తక్కువగా వస్తుంటాయి. ఫస్ట్‌ పార్ట్‌కు థియేటర్‌లోనే కాకుండా ఓటీటీలోనూ మంచి ఆదరణ లభించింది. దీని సీక్వెల్‌ను అలానే ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అని కాలభైరవ చెప్పారు. మొదటిభాగం అంచనాలకు మించి విజయం సాధించిందని శ్రీసింహా ఆనందం వ్యక్తంచేశారు.

Also Read : Kill: ఓటీటీలోనికి సూపర్‌ హిట్‌ యాక్షన్ థ్రిల్లర్‌ ‘కిల్‌’ ! స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

Faria AbdullahMathu Vadalara 2
Comments (0)
Add Comment