Hero Sandeep Kishan-Mazaka :జీ5 ఓటీటీలో మ‌జాకా మూవీ

మార్చి 28 నుంచి స్ట్రీమింగ్

Mazaka : త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ , రీతు వ‌ర్మ‌, అన్షు అంబానీ, రావు ర‌మేష్ క‌లిసి న‌టించిన మ‌జాకా(Mazaka) చిత్రం విడుద‌లైంది. పూర్తిగా కామెడీ జాన‌ర్ లో తీశాడు ద‌ర్శ‌కుడు. గ‌త నెల ఈ మూవీని 26న వ‌చ్చింది. ఇంటిల్లిపాదిని ఆక‌ట్టుకుంది. పూర్తిగా వినోదాత్మ‌క చిత్రంగా ఉండ‌డంతో ఆదరించారు. అయితే క‌మ‌ర్షియ‌ల్ గా వ‌ర్క‌వుట్ కాలేదు. 20 ఏళ్ల సుదీర్ఘ కాలం త‌ర్వాత త‌ళుక్కున మెరిసింది మ‌న్మ‌థుడు త‌ర్వాత అన్షు.

Mazaka Movie OTT Updates

సందీప్ కిష‌న్ , రావు ర‌మేష్ తండ్రీ కొడుకులుగా కీ రోల్స్ పోషించారు. న‌టీ న‌టులంతా ప‌ర్ ఫార్మెన్స్ చేశారు. ఇందులో య‌శోద పాత్ర‌లో మంచి మార్కులు కొట్టేసింది. సినిమాకు పాజిటివ్ టాక్ వ‌చ్చినా ఆ త‌ర్వాత ఎందుక‌నో ఆద‌ర‌ణ‌కు నోచుకోలేక పోయింది. చిత్ర క‌థ ముందుగానే తెలిసి పోవ‌డంతో ప్రేక్ష‌కులు నిరాశ‌కు లోన‌య్యారు.

తాజాగా మూవీ మేక‌ర్స్ మ‌జాకా చిత్రం గురించి ఆస‌క్తిక‌ర‌మైన అప్ డేట్ ఇచ్చింది. మార్చి 28న ఓటీటీలోకి రానుంది. జీ5 ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుంది. దీనిని భారీ ధ‌ర‌కు చేజిక్కించుకుంది. కామెడీ ఉండ‌డంతో చిత్రానికి భారీ ఆద‌ర‌ణ ద‌క్క‌డం ఖాయ‌మ‌ని సినీ క్రిటిక్స్ ఆశిస్తున్నారు. సందీప్ కిష‌న్ , రీతు వ‌ర్మ సూప‌ర్ కాంబినేష‌న్ అయినా మ‌జాకా ఏ మేర‌కు స్ట్రీమింగ్ లో ఆక‌ట్టుకుంటుంద‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

Also Read : Deepika Padukone Sensational :మ‌న‌కెందుకు ఆస్కార్ లు రావ‌డం లేదు..?

CinemaMazakaOTTTrendingUpdates
Comments (0)
Add Comment