Mazaka Super Sequel :మ‌జాకా సూప‌ర్ సీక్వెల్ ప‌క్కా

ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు నక్కిన

Mazaka : మ‌హా శివ‌రాత్రికి నిజ‌మైన పండుగ మ‌జాకా రూపంలో వ‌చ్చేసింది. ఇప్ప‌టికే అన్ని చోట్ల నుంచి ప్రీమియ‌ర్ షోకు సంబంధించి పాజిటివ్ టాక్ వ‌చ్చింది. ఫుల్ కామెడ్ ఎంట‌ర్టైన్మెంట్ గా తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన‌(Trinadha Rao Nakkina). తండ్రీ కొడుకులుగా రావు ర‌మేష్ , సందీప్ కిష‌న్ న‌టించారు.

Mazaka Sequel Updates

ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ‌టం ఇందులో ప్ర‌ధానాంశం. మ‌న్మ‌థుడు మూవీలో త‌ళుక్కున మెరిసి మాయ‌మై పోయిన అన్షు ఉన్న‌ట్టుండి 20 ఏళ్ల త‌ర్వాత మ‌జాకా చిత్రంలో న‌టించింది. త‌ను కూడా రావు ర‌మేష్ తో పోటీ ప‌డి న‌టించ‌గా రీతూ వ‌ర్మ సందీప్ కిష‌న్ తో జోడీ క‌ట్టింది.

ఇది పూర్తిగా ప‌క్కా వినోదాత్మ‌క‌మైన సినిమా. మ‌జాకా మూవీ గురించి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశాడు ద‌ర్శ‌కుడు. ఈ శివ‌రాత్రికి మ‌జాకా ప‌క్కా హిట్ కావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పాడు. ఇంటిల్లిపాది కూర్చుని చూసి త‌ర‌లించేలా సినిమాను మ‌లిచాన‌ని చెప్పాడు డైరెక్ట‌ర్. ఈ సంద‌ర్బంగా ప్రేక్ష‌కుల‌కు, త‌న‌కు స‌హ‌క‌రించిన న‌టీ న‌టుల‌కు, అంత‌కు మించి సినిమా బాగా రావ‌డానికి సాయం చేసిన నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ చేశారు.

మ‌జాకాను చూసిన వారంతా సూప‌ర్ అంటున్నార‌ని అన్నారు…ఇక మ‌జాకాకు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మ‌జాకా మూవీ బిగ్ హిట్ కొట్ట‌డంతో దీనికి సీక్వెల్ కూడా ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన‌.

Also Read : Aadhi Pinishetty Interesting Comment : బంధం నిజం విడిపోవ‌డం అబ‌ద్దం

MazakaSequelTrendingTrinadha Rao NakkinaUpdates
Comments (0)
Add Comment