Naga Chaitanya-Meenakshi : హీరో నాగ చైతన్య సరసన సినిమా ఛాన్స్ కొట్టేసిన మీనాక్షి

కానీ దుల్కర్ సల్మాన్ జోడిగా నటించిన లక్కీ భాస్కర్ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది...

Naga Chaitanya : ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఆ తర్వాత హిట్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీకి తెలుగులో ఆఫర్స్ క్యూ కట్టాయి. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. దీంతో తెలుగులో అమ్మడుకు ఆఫర్స్ మరిన్ని ఎక్కువయ్యాయి. ఇటీవలే మట్కా చిత్రంతో అడియన్స్ ముందుకు వచ్చింది. వరుణ్ తేజ్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది.

Naga Chaitanya-Meenakshi Chaudhary Movie..

కానీ దుల్కర్ సల్మాన్ జోడిగా నటించిన లక్కీ భాస్కర్ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో ఇప్పుడు మీనాక్షికి మరో క్రేజీ ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. అక్కినేని నాగచైతన్య హీరోగా డైరెక్టర్ కార్తీక్ దండు డైరెక్షన్లో ఓ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో మీనాక్షి చౌదరిని కథానాయికగా ఎంపిక చేసినట్లు సమాచారం. వీరిద్దరి కాంబో పై ఇప్పుడు మరింత ఆసక్తి ఏర్పడింది. ప్రస్తుతం చైతన్య తండేల్ మూవీ చిత్రీకరణలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా.. చందూ మొండేటీ దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు మీనాక్షికి చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : Nayanthara-Samantha : ఆ ఇద్దరి భామలు పై పబ్లిసిటీ ఫుల్ రిజల్ట్ నిల్ అంటున్న ఫ్యాన్స్

Akkineni Naga ChaitanyaMeenakshi ChaudharyMoviesTrendingUpdatesViral
Comments (0)
Add Comment