Beauty Meenakshi Chaudhary :ఆ స‌మ‌స్య వ‌ల్ల చాలా ఇబ్బంది ప‌డ్డా

న‌టి మీనాక్షి చౌద‌రి కామెంట్స్

Meenakshi Chaudhary : అందాల ముద్దుగుమ్మ మీనాక్షి చౌద‌రి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. త‌న కెరీర్ గురించి చిట్ చాట్ సంద‌ర్బంగా పంచుకుంది. అభిప్రాయాల‌ను వ్య‌క్త ప‌రిచింది. సంక్రాంతికి వ‌స్తున్నాం మూవీ త‌న‌కు బూస్ట్ ఇచ్చింద‌ని చెప్పింది. అయితే ఈ స్థాయికి రావ‌డానికి చాలా ఇబ్బందులు ప‌డ్డాన‌ని తెలిపింది. తాను కాలేజీ రోజుల్లో చ‌దువుకునే స‌మ‌యంలో ఎత్తు ఎక్కువ‌గా ఉండ‌డంతో త‌న‌తో క‌లిసేందుకు, మాట్లాడేందుకు , స్నేహం చేసేందుకు ఎవ‌రూ ముందుకు వ‌చ్చే వారు కాద‌ని తెలిపింది. ఇదే క్ర‌మంలో నా గురించి నేను ఆలోచించ‌డం మొద‌లు పెట్టా. ఎత్తు అనేది స‌మ‌స్య కాద‌ని, మ‌న మీద మ‌న‌కు న‌మ్మ‌కం అనేది ఉంటే అనుకున్న ల‌క్ష్యాన్ని చేరుకోవ‌డం సులువు అవుతుంద‌ని న‌మ్మాన‌ని పేర్కొంది ఈ లవ్లీ బ్యూటీ.

Meenakshi Chaudhary Shocking Comments

నేను విమ‌ర్శ‌ల‌ను ప‌ట్టించుకోను. నాకు ఇచ్చిన పాత్ర ఏమిటి..ఎంత వ‌ర‌కు న్యాయం చేయాల‌నే దాని గురించి ప్ర‌య‌త్నం చేస్తాను త‌ప్పా ఇంకొక‌రి గురించి ఆలోచించే టైం త‌న‌కు ఉండ‌ద‌ని తెలిపింది మీనాక్షి చౌద‌రి(Meenakshi Chaudhary). డెంట‌ల్ కాలేజీలో కోర్సు చేశా. స్వ‌స్థ‌లం హ‌ర్యానా లోని పంచ్ కులా. కెరీర్ మొద‌ట‌గా మోడ‌లింగ్ తో మొద‌లైంద‌ని తెలిపింది. ఫెమినా మిస్ ఇండియాగా, మిస్ గ్రాండ్ ఇంట‌ర్నేష‌న‌ల్ పోటీల్లో ర‌న్న‌ర్ అప్ గా నిలిచాన‌ని చెప్పింది మీనాక్షి చౌద‌రి. 2018లో మిస్ ఇండియా పేజెంట్ గా నిలిచింది.

అనుకోకుండా 2021లో ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది . ఖిలాడి, కొలై , గుంటూరు కారం, సింగ‌పూర్ సెలూన్, ల‌క్కీ భాస్క‌ర్ , గోట్ – ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ లో విజ‌య్ ద‌ళ‌ప‌తి స‌ర‌స‌న న‌టించింది. మ‌ట్కా, మెకానిక్ రాకీలో మెరిసింది. ఈ ఏడాది సంక్రాంతి సంద‌ర్బంగా సంక్రాంతికి వ‌స్తున్నాంలో సూపర్ షో చేసింది. అంతే కాకుండా మ్యూజిక్ వీడియోల‌లో కూడా న‌టించి..మెప్పించింది. ఎత్తుగా ఉన్నాన‌నే విష‌యంపై తాను ఆలోచించ‌డం మానేశాన‌ని, అదే త‌న‌కు స‌క్సెస్ ఇచ్చేలా చేసింద‌ని స్ప‌స్టం చేసింది మీనాక్షి చౌద‌రి.

Also Read : Hero Ajith Kumar : అజిత్ న‌మ్మ‌క ద్రోహం హీరా ఆగ్ర‌హం

CommentsMeenakshi ChaudharyShockingUpdatesViral
Comments (0)
Add Comment