Meenakshi Chaudhary: భయపెట్టే కథలో మహేశ్ బాబు బ్యూటీ మీనాక్షి చౌదరి ?

భయపెట్టే కథలో మహేశ్ బాబు బ్యూటీ మీనాక్షి చౌదరి ?

Meenakshi Chaudhary: సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘గుంటూరు కారం’ సినిమాతో సినీ ప్రియుల్ని విశేషంగా అలరించిన నటి మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary). ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో కలిసి ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ లో నటిస్తోంది. దీనితో పాటు తెలుగు, తమిళ భాషల్లో వరుసగా అగ్రహీరోలతో జోడీ కడుతూ స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు వడివడిగా అడుగులు వేస్తుంది. ఓవైపు వెంకటేశ్, విజయ్‌ లాంటి సీనియర్‌ హీరోల సరసన నటిస్తూనే.. మరోవైపు వరుణ్‌తేజ్, దుల్కర్‌ సల్మాన్, విష్వక్‌ సేన్‌ లాంటి యువతారలతోనూ ఆడిపాడుతూ కెరీర్‌ను వైవిధ్యభరితంగా పరుగులు పెట్టిస్తోంది మీనాక్షి చౌదరి.

Meenakshi Chaudhary Movies Update

అయితే ఇప్పుడీ భామ కోలీవుడ్ నుంచి మరో కొత్త అవకాశం అందుకున్నట్లు తెలుస్తోంది. ‘డీడీ రిటర్న్స్‌’ అనే హారర్‌ కామెడీ చిత్రంతో తమిళ ప్రేక్షకుల్ని మెప్పించిన ఎస్‌.ప్రేమ్‌ ఆనంద్‌… దీనికి సీక్వెల్ గా ‘డీడీ రిటర్న్స్‌ 2’ను ఇటీవలే పట్టాలెక్కించారు. ఇప్పుడా చిత్రంలోని ప్రధాన పాత్ర కోసం చిత్ర బృందం మీనాక్షిని సంప్రదించినట్లు సమాచారం. ఈ చర్చలు ఇప్పటికే తుది దశకు చేరుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో ఇప్పటివరకు చాలా సాఫ్ట్ పాత్రల్లో కనిపించిన మీనాక్షి… హర్రర్ మూవీలో ఎలా చేస్తుందోనని అభిమానుల్లో ఆశక్తి నెలకొంది. ఇక మీనాక్షి ప్రస్తుతం తెలుగులో వెంకటేశ్‌ – అనిల్‌ రావిపూడి సినిమాతో పాటు ‘మట్కా’, ‘లక్కీ భాస్కర్‌’, ‘మెకానిక్‌ రాకీ’ చిత్రాల్లో నటిస్తోంది.

Also Read : Raj Tarun-Lavanya : రాజ్ తరుణ్ లేని లైఫ్ నాకొద్దంటూ ఆత్మహత్యాయత్నం చేసిన లావణ్య

DD ReturnsMahesh BabuMeenakshi Chaudhary
Comments (0)
Add Comment