Beauty Meenakshi Chaudhary :అవ‌కాశం వ‌స్తే బాల‌య్య‌తో న‌టించేందుకు సిద్దం

న‌టి మీనాక్షి చౌద‌రి కామెంట్స్

Meenakshi Chaudhary : కోలీవుడ్ కు చెందిన న‌టి మీనాక్షి చౌద‌రి(Meenakshi Chaudhary) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మంచి స్క్రిప్ట్, కేర‌క్ట‌ర్ వ‌స్తే త‌ప్ప‌కుండా నంద‌మూరి బాల‌కృష్ణ‌తో న‌టించేందుకు తాను సిద్దంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించింది. త‌ను త‌మిళ, తెలుగు సినిమాల‌లో న‌టించి ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యింది. ప్ర‌ధానంగా తాజాగా ఈ ఏడాది సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా రిలీజ్ అయిన సంక్రాంతికి వ‌స్తున్నాం మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఇది ఏకంగా రూ. 300 కోట్ల‌ను వ‌సూలు చేసింది.

Meenakshi Chaudhary Comments Viral

ఇందులో మీనాక్షి చౌద‌రి కీ రోల్ పోషించింది. పోలీస్ ఆఫీస‌ర్ గా, విక్ట‌రీ వెంక‌టేశ్ కు మాజీ గ‌ర్ల్ ఫ్రెండ్ గా ఇర‌గ‌దీసింది. న‌ట‌నా ప‌రంగా, డ్యాన్సుల‌తో హోరెత్తించింది. ద‌ళ‌ప‌తి విజ‌య్ , త‌దిత‌ర స్టార్ హీరోల‌తో మూవీస్ చేసింది. ఓ వైపు సినిమాలు మ‌రో వైపు ఈవెంట్స్ కు హాజ‌ర‌వుతోంది. దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క బెట్టుకోవాల‌ని ప్లాన్ చేస్తోంది ఈ అమ్మ‌డు. తాజాగా హైద‌రాబాద్ లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మానికి త‌నతో పాటు నంద‌మూరి బాల‌య్య చీఫ్ గెస్ట్ లుగా హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్బంగా చిట్ చాట్ చేసింది మీనాక్షి చౌద‌రి. బాల‌య్య లాంటి మాస్ ఇమేజ్ క‌లిగిన న‌టుడితో ఛాన్స్ వ‌స్తే ఎలా చేయ‌కుండా ఉంటానంటూ ప్ర‌శ్నించింది. తాను కూడా రెడీగా ఉన్నాన‌ని, ఆయ‌న‌తో నేర్చు కోవాల్సిన‌వి ఎన్నో ఉన్నాయంటూ పేర్కొంది. కాగా బాల‌య్య మంచి ఊపు మీద ఉన్నాడు. త‌ను న‌టించిన మూడు సినిమాలు బిగ్ స‌క్సెస్ అయ్యాయి. వాటిలో అఖండ‌, భ‌గ‌వంత్ కేస‌రి, డాకు మ‌హారాజ్. కుర్ర హీరోల‌తో పోటీ ప‌డి న‌టిస్తున్నాడు. మొత్తంగా మీనాక్షి చౌద‌రి చేసిన ఈ కామెంట్స్ ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారాయి.

Also Read : L2 Empuraan- Big Success :రూ. 100 కోట్ల క్ల‌బ్ లోకి ఎంపురాన్

BalakrishnaCinemaCommentsMeenakshi ChaudharyViral
Comments (0)
Add Comment