Megastar Chiranjeevi: అభిమాని కుటుంబానికి మెగాస్టార్ ‘చిరు’ సత్కారం !

అభిమాని కుటుంబానికి మెగాస్టార్ ‘చిరు’ సత్కారం !

Megastar Chiranjeevi: తనపై విభిన్నంగా అభిమానాన్ని చాటుకున్న ఓ అభిమానిని చూసి ప్రముఖ నటుడు చిరంజీవి మురిసిపోయారు. ఆ అభిమానితోపాటు ఆయన కుటుంబాన్ని హైదరాబాద్‌ లోని తన నివాసానికి ఆహ్వానించి, సత్కరించారు. ఈ నెల 22న చిరంజీవి పుట్టినరోజు పురస్కరించుకుని… ఈశ్వ‌ర‌య్య అనే అభిమాని తిరుప‌తి నుంచి తిరుమ‌ల కొండ వ‌ర‌కు పొర్లు దండాలు పెట్టుకుంటూ వెళ్లి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న చిరంజీవి… ఈశ్వ‌రయ్య కుటుంబ స‌భ్యుల‌ను ప్ర‌త్యేకంగా ఆహ్వానించి మాట్లాడారు. పట్టు వస్త్రాలతో సత్కరించారు. ఈశ్వ‌ర‌య్య కుటుంబానికి తానెప్పుడూ అండ‌గా ఉంటాన‌ని ఈ సందర్భంగా చిరంజీవి హామీ ఇచ్చారు.

Megastar Chiranjeevi Helps

ఇంతకుముందు ఈశ్వరయ్య… తిరుపతి నుంచి చిరంజీవి ఇంటి వరకూ సైకిల్‌ యాత్ర చేశారు. పవన్‌ కళ్యాణ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని, జనసేన పార్టీ గెలవాలని… పలుమార్లు పొర్లు దండాలతో శ్రీవారిని దర్శించుకున్నారు.

మరోవైపు సోమవారం… చిరంజీవి అయ్య‌ప్ప మాల‌ ధరించారు. ప్ర‌తి ఏడాది అయ్య‌ప్ప మాల‌ను ధరించే చిరు… ఈ ఏడాది కూడా అదే ఫాలో అయిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Also Read : Sridevi Vijay Kumar : మల్లి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న ప్రభాస్ మొదటి సినిమా హీరోయిన్

Mega Star ChiranjeeviViswambhara
Comments (0)
Add Comment