Hero Chiranjeevi Praises :ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌సంగం అద్భుతం

కితాబు ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi : త‌న సోద‌రుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను చూస్తే త‌న‌కు గ‌ర్వంగా ఉంద‌న్నారు మెగాస్టార్ చిరంజీవి. కాకినాడ జిల్లా పిఠాపురం వేదిక‌గా జ‌రిగిన జ‌న‌సేన జ‌య‌కేత‌నం ఆవిర్భావ స‌భ సంద‌ర్బంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన ప్ర‌సంగం త‌న‌ను విస్తు పోయేలా చేసింద‌న్నారు. ఎక్స్ వేదిక‌గా త‌న భావోద్వేగాన్ని పంచుకున్నారు. తాను త‌న‌ను చూస్తూ ఉండి పోయానే తప్పా ఏమ‌నాలో తెలియ‌కుండా పోయింద‌న్నారు మెగాస్టార్(Chiranjeevi). ఎంతో ప‌రిణ‌తి చెందిన నాయ‌కుడి కంటే ఎక్కువ‌గా మాట్లాడావంటూ చాలా ఆనందంగా ఉంద‌న్నారు.

Chiranjeevi Praises Pawan Kalyan Speech

అటు రాజ‌కీయాలు, ఇటు పుస్త‌కాలు, స‌మ‌కాలీన అంశాల ప‌ట్ల ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పిన తీరు త‌న‌ను విస్మ‌యానికి గురి చేసింద‌న్నారు చిరంజీవి. ఎవ‌రికి ఎలా జ‌వాబు చెప్పాలో కూడా త‌ను ఎదిగిన ప‌ద్ద‌తి చూస్తే ముచ్చ‌ట వేస్తోంద‌ని చెప్పారు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఎన్నో క‌ష్టాలు , మ‌రెన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఈ స్థాయికి రావ‌డం మామూలు విష‌యం కాద‌న్నారు చిరంజీవి. త‌ను చేసిన ప్ర‌సంగం కోట్లాది మందిని ప్ర‌భావితం చేస్తుంద‌న‌డంలో సందేహం లేద‌న్నారు. త‌ను ముందు నుంచీ ఓ ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తి అని పేర్కొన్నారు.

త‌ను త‌న‌కు సోద‌రుడు కావ‌డం పూర్వ జ‌న్మ సుకృత‌మ‌ని అన్నారు. త‌న త‌ల్లి కూడా ఎన‌లేని సంతోషానికి గురైంద‌న్నారు. అంతే కాదు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు త‌న వ‌దిన అంటే విప‌రీత‌మైన గౌర‌వ‌మ‌ని, ఇప్ప‌టికీ ఎంతో ఎత్తుకు ఎదిగినా మూలాలు మ‌రిచి పోలేద‌న్నారు. అందుకే త‌న‌కు ముందు నుంచీ పేద‌ల‌కు, ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌న్న త‌లంపుతో ఉన్నాడ‌ని, ఆ దిశ‌గా త‌ను అనుకున్న‌ది సాధించాడ‌ని ప్ర‌శంస‌లు కురిపించారు.

Also Read : Hero Ram Charan-Naayak : చెర్రీ బ‌ర్త్ డే గిఫ్ట్ నాయ‌క్ రీ రిలీజ్

ChiranjeeviCommentspawan kalyanTrending
Comments (0)
Add Comment