Beauty Megha Akash :మేఘా ఆకాష్ వెబ్ సీరీస్ లో బిజీ

ఆక‌ట్టుకుంటున్న విక‌ట‌క‌విలో కీ రోల్

Megha Akash : అందాల తార మేఘా ఆకాష్ రూట్ మార్చింది. త‌ను సినీ కెరీర్ ను హీరో నితిన్ రెడ్డితో క‌లిసి లై మూవీ చిత్రంతో ప్రారంభించింది. కానీ ఆశించిన మేర ఆక‌ట్టు కోలేక పోయింది. తెలుగులో చ‌ల్ మోహ‌న్ రం, రాజ రాజ చోర‌, డియ‌ర్ మేఘా లాంటి చిత్రాలలో న‌టించింది. అయినా ఎందుక‌నో త‌ను స్టార్ హీరోయిన్ గా ఎద‌గ‌లేక పోయింది. న‌ట‌నా ప‌రంగా ప్ల‌స్ మార్క్ లు వ‌చ్చినా త‌ర్వాత సినిమాల‌లో న‌టించేందుకు అవ‌కాశాలు రాలేదు.

Megha Akash Web Series

ఇదే స‌మ‌యంలో మేఘా ఆకాష్(Megha Akash) త‌మిళంలో బిగ్ స‌క్సెస్ అయిన పెట్టా, ఎనై నోక్కి పాయుమ్ తోట చిత్రాల్లో న‌టించింది. హిందీలో శాటిలైట్ శంక‌ర్ చిత్రంలో న‌టించినా అంతగా వ‌ర్క‌వుట్ కాలేదు. అందంతో పాటు అభియ‌నం ప‌రంగా బాగున్న‌ప్ప‌టికీ ఎందుక‌నో మూవీస్ రాక పోవ‌డంతో త‌ను రూట్ మార్చింది మేఘా ఆకాష్. ప్ర‌స్తుతం తెలుగులోనే కాదు క‌న్న‌డ‌, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళంల‌లో థియేట‌ర్లు కాకుండా డిజిట‌ల్ ఫ్లాట్ ఫార‌మ్ ల‌కు సంబంధించి ఓటీటీలు ఫుల్ డామినేట్ చేస్తున్నాయి.

దీంతో ఈ ముద్దుగుమ్మ మ‌న‌సు మార్చుకుంది. డిజిట‌ల్ మీడియాలోని ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సీరీస్ ల‌పై ఫోక‌స్ పెట్టింది. ఇందులో భాగంగా తెలుగులో తీస్తున్న విక‌ట‌క‌వి వెబ్ సీరీస్ లోకి ఎంట్రీ ఇచ్చింది మేఘా ఆకాష్. త‌ను సామాజిక మాధ్య‌మాల‌లో యాక్టివ్ గా ఉంటుంది. ప్ర‌స్తుతం అబుదాబిలో వేస‌వి వెకేష‌న్ లో బిజీగా ఉంది. ఎడారి మ్యాజిక్ ని వ‌ర్ణించ‌డం చాలా క‌ష్టం అంటూ పేర్కొంది త‌న ఖాతాలో.

Also Read : Beauty Samantha Marriage :స‌మంత రాజ్ నిడిమోరు పెళ్లికి రెడీ..?

Megha AkashUpdatesViralWeb Series
Comments (0)
Add Comment