Metro Rail Phase 2 Sensational :రూ. 19,000 కోట్ల‌తో మెట్రో రైల్ ఫేజ్ -2

డిపీఆర్ సిద్దం చేసిన ఎండీ రెడ్డి

Metro Rail Phase 2 : హైద‌రాబాద్ – ప్ర‌తిష్టాత్మ‌క‌మైన హైద‌రాబాద్ మెట్రో రైల్ ఫేజ్ -2(Metro Rail Phase 2) కు సంబంధించి డీపీఆర్ సిద్ద‌మైంది. ఈ మేర‌కు రూ. 19,000 కోట్ల అంచ‌నాల‌తో నిర్మించ‌నున్నారు. వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక ( డీపీఆర్) ను హైదరాబాద్ విమానాశ్రయ మెట్రో లిమిటెడ్ (హెచ్ ఏ ఎంఎల్) ఆమోదించింది. అంచ‌నా ఖ‌ర్చు భారీ ఎత్తున చేర్చింది. ఈ ఫేజ్ -2 మెట్రో రైలు విస్త‌ర‌ణ 86.5 కిలోమీట‌ర్లు ఉంటుంది. ఇందు కోసం మూడు మార్గాలు ఏర్పాటు చేశారు.

Metro Rail Phase 2 Updates

జూబ్లీ హిల్స్ బస్ స్టేష‌న్ నుండి మేడ్చ‌ల్, జేబీఎస్ షామీర్ పేట్, శంషాబద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్యూచ‌ర్ సిటీ వ‌ర‌కు ఉండ‌నున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం ప్ర‌త్యేకంగా త‌యారు చేసిన డీపీఆర్ ల‌ను ఆమోదం కోసం రాష్ట్ర స‌ర్కార్ కు పంపించారు. త‌దుప‌రి కేబినెట్ లో చ‌ర్చించ‌నున్నారు. ఆమోదం పొందితేనే దీనిని నిర్మాణం చేప‌డ‌తారు. లేక‌పోతే ఆగి పోతుంది.

ప్ర‌స్తుత ప్ర‌భుత్వం , సీఎం రేవంత్ రెడ్డి పొద్దున లేస్తే రాత్రి ప‌డుకునే దాకా ఫ్యూచ‌ర్ సిటీ అని జ‌పం చేస్తున్నారు. ఇక్క‌డ‌నే అన్ని కంపెనీలు వ‌స్తాయ‌ని ఊద‌ర గొడుతున్నారు. ఇది ప‌క్క‌న పెడితే వాస్త‌వానికి రియ‌ల్ ఎస్టేట్ పూర్తిగా ప‌డి పోయింది. ఎవ‌రూ కొనేందుకు రావ‌డం లేదు. ఇక మెట్రో రైల్ ఫేజ్ 2 కేబినెట్ ఓకే చేస్తే దానిని కేంద్రానికి పంపిస్తారు. కొంచం టైం ప‌ట్టేలా ఉంది.

Also Read : Minister Vangalapudi Anitha Interesting :త్వ‌ర‌లోనే ఏపీలో పోలీస్ అకాడెమీ

BreakingMetro Rail Phase 2newsUpdatesViral
Comments (0)
Add Comment