Vangalapudi Anitha : అమరావతి – అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తమ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. తణుకు నియోజకవర్గంలో రూ. 6.5 కోట్ల విలువైన పనులను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపనలు చేశారు. అనంతరం భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ , బాబు జగ్జీవన్ రామ్ ల విగ్రహాలను ఆవిష్కరించారు. మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు వంగలపూడి అనిత.
AP Home Minister Vangalapudi Anitha Interesting Comments
అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ దళితులకు రెండు కళ్ల లాంటి వారన్నారు. అలాంటి వ్యక్తుల విగ్రహాలను ఒకేచోట ఏర్పాటు చేసుకోవడం దళితుల ఐక్యతకు నిదర్శనమని చెప్పారు. 2019లో జగన్ ను నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే దళితులను టార్గెట్ చేసి పాలన సాగించారని మండిపడ్డారు. డాక్టర్ సుధాకర్ ను పిచ్చివాడిగా ముద్రవేసి చనిపోయేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుడ్ని చంపి డోర్ డెలివీర చేసిన ఘనత వైసీపీ నాయకులదేనని మండిపడ్డారు.
ఓ మహిళా అధికారిని ఎన్నో రకాలుగా వేధించారన్నారు మంత్రి వంగలపూడి అనిత(Vangalapudi Anitha). మాజీ ఎమ్మెల్యే టీడీఆర్ బాండ్ల స్కామ్ లో మునిగి పోయారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో దళితుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందన్నారు. బంగారు కుటుంబం కాన్సెప్ట్ తో పీ4 విధానం ద్వారా అణగారిన వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. సమానత్వానికి మార్గదర్శిగా పాలన సాగుతోందన్నారు.
Also Read : Ponnam Prabhakar Shocking :తెలంగాణ విద్యార్థుల పట్ల వివక్ష తగదు
Minister Vangalapudi Anitha Interesting :ప్రజా సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం
స్పష్టం చేసిన మంత్రి వంగలపూడి