Mirnalini Ravi : సొంత ఇంటిని నిర్మించుకొని గృహప్రవేశం చేసిన మృణాళిని

సొంత ఇంటిని నిర్మించుకొని గృహప్రవేశం చేసిన మృణాళిని..

Mirnalini Ravi : టిక్‌టాక్‌, యూ ట్యూబ్ వీడియోల‌తో సెల‌బ్రిటీగా మారి వ‌రుణ్ తేజ్ గ‌ద్ద‌ల కొండ గ‌ణేశ్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు ద‌క్కించుకున్న ముద్దుగ‌మ్మ మృణాళిని ర‌వి. ఆ త‌ర్వాత త‌మిళంలో, తెలుగులో వ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్ని ఉప‌యోగించుకుంటూ సినిమాలు చేస్తోంది. తెలుగులో ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, మామా మ‌శ్చీంద్ర, త‌మిళంలో చియాన్ విక్ర‌మ్ కోబ్రా , విశాల్ ఎనిమీ, విజ‌య్ అంటోని రోమియో , మాంబో, ఎమ్జీఆర్ మాగ‌న్ వంటి అర డ‌జ‌న్‌కు పైగా సినిమాల్లో న‌టించింది. తాజాగా ఈ అమ్మ‌డు త‌న క‌ష్టార్జితంతో తండ్రితో క‌లిసి బెంగ‌ళూరులో ఓ సొంతింటిని నిర్మించుకుని గృహ ప్ర‌వేశం చేసింది.

Mirnalini Ravi New House…

ఈ సంద‌ర్భంగా త‌ను చిన్న‌త‌నం నుంచి కంటున్న సొంతింటి క‌ల‌ను ఇప్ప‌టికీ తీర్చుకున్నాన‌ని ఇప్పుడు చాలా సంతోషంగా ఉందంటూ సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టి ఫంక్ష‌న్ ఫొటోలు జ‌త చేసింది. ఇప్పుడీ చిత్రాలు సామాజిక మాధ్య‌మాల్లో బాగా వైర‌ల్ అవుతున్నాయి. చాలామంది అభిమానులు, సెల‌బ్రిటీలు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. మీరూ చూసేయండి.

Also Read : Munjya OTT : ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ కు సిద్ధమైన బాలీవుడ్ బ్లాక్ బస్టర్

Mirnalini RaviTrendingUpdatesViral
Comments (0)
Add Comment