మ‌నిషిగా చూడ‌లేదు వేశ్య‌గా చూశారు

ఇంగ్లండ్ మిస్ మిల్లా మాగీ కామెంట్స్

హైద‌రాబాద్ – తెలంగాణ కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న మిస్ వ‌ర‌ల్డ్ 2025 పోటీల‌పై సంచ‌ల‌న ఆరోణ‌లు చేసింది మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ. తీవ్ర మ‌న‌స్థాప‌తంతో త‌ను పోటీల నుంచి వెళ్లి పోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆమె చేసిన కామెంట్స్ ప్ర‌పంచ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఇప్ప‌టి దాకా ఉన్న హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. నిర్వాహ‌కుల కార‌ణంగా, ప్ర‌వ‌ర్త‌న త‌న‌ను తీవ్రంగా క‌లిచి వేసేలా చేసింద‌న్నారు.

నిర్వాహకులు త‌న‌ను ఎన్నో విధాలుగా అవమానించారని, ఇలాంటి ఇబ్బందులు తాను ఎక్కడా ఎదుర్కో లేద‌ని అన్నారు మిల్ మిల్లా మాగీ. నిర్వాహకుల ప్రవర్తన, పోటీ జరుగుతున్న తీరు చూస్తే, నన్ను వేశ్య లాగా చూస్తున్నారని అనిపించిందన్నారు. ధనవంతులైన మగాళ్ల ముందు త‌మ‌ను అంగడి బొమ్మగా నిలబెట్టి ఊరేగించారంటూ వాపోయింది.

సమాజంలో మార్పు కోసం , మంచి కోసం మిస్ వరల్డ్ పోటీలకు వచ్చానని చెప్పారు. కానీ అందాల ఆరబోతకు కాదని స్ప‌ష్టం చేశారు మిస్ మిల్లా మాగీ. అందాల భామలను సర్కస్‌లో ప్రదర్శించే కోతుల లాగా ట్రీట్ చేస్తున్నారని ఆరోపించారు. ఇన్ని అవమానాలు భరించలేక అక్కడ ఉండలేకనే పోటీ మధ్యలోనే ఇంటికి వచ్చేశానంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది మిస్ మిల్లా మాగీ.

త‌న వ‌య‌సు 24 ఏళ్లు. ఈ అందాల పోటీల నుంచి తప్పుకోవ‌డ‌మే మంచిద‌ని తన‌కు అనిపించింద‌న్నారు. ఆమె ఇంగ్లండ్ త‌ర‌పున పోటీ ప‌డ్డారు. గ‌త ఏడాది మిస్ ఇంగ్లాండ్ టైటిల్ ను గెలుచుకుంది. ది స‌న్ మ్యాగ‌జైన్ కు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో తాను ఎందుకు వైదొల‌గాల‌ని అనుకుంటున్నాన‌నో చెప్పింది.

ప్రజల వినోదం కోసం నేను అక్క‌డికి వెళ్ల లేద‌న్నారు. త‌న‌ను వారంతా వేశ్య‌లా చూశార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. భిన్నమైన భవిష్యత్తును సృష్టించడంలో సహాయ పడటానికి, బహుశా యువతకు స్ఫూర్తిని ఇచ్చేందుకు బయలుదేరాను. మిలియన్ సంవత్సరాలలో నేను ఆ పరిస్థితిలో ఉంటానని ఎప్పుడూ ఊహించ లేద‌న్నారు.

Comments (0)
Add Comment