ఈ మధ్యన టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ కొనసాగుతోంది. చిన్న సినిమాలకు ప్రయారిటీ పెరుగుతోంది. కంటెంట్ పై ఎక్కువగా దర్శక, నిర్మాతలు ఫోకస్ పెడుతున్నారు. ఈ ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కోర్ట్, సారంగపాణి జాతకం, సింగిల్ తో పాటు డ్రాగన్ , మ్యాడ్ సీక్వెల్ మూవీస్ దుమ్ము రేపాయి. వీటిలో ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
బిగ్ మూవీస్ కు షాక్ ఇచ్చింది. ఇందులో నటించిన ప్రదీప్ నేషనల్ స్టార్ గా మారి పోయాడు. తనకు బంపర్ ఆఫర్స్ వచ్చాయి. ఇదే సమయంలో ప్రియదర్శి, వెన్నెల కిషోర్, శ్రీ విష్ణు లైమ్ లైట్ లోకి వచ్చారు. వీరికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తాజాగా ప్రియదర్శి , రాగ్ మయూర్, విష్ణు ఓయ్ , ప్రసాద్ బెహరా కలిసి నటించిన చిత్రం మిత్ర మండలి. ఈ సినిమాకు సంబంధించి తాజాగా మూవీ మేకర్స్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. కామెడీ ఫుల్ గా ఉంది. మొత్తంగా ఫీల్ గుడ్ మూవీలా అనిపించేలా తీశాడు దర్శకుడు.
ఈ పోస్టర్ నీలి ముసుగుల వెనుక ఉన్న ముఠాను పరిచయం చేసింది. అపరితమమైన వినోదం, సూపర్ సంభాషణలతో కొనసాగింది. భిన్నమైన పాత్రలను ఎంచుకుంటున్నారు ప్రియదర్శి, మ్యాడ్ మూవీ ఫేమ్ విష్ణు ఓయి. వీరితో పాటు ప్రసాద్ , రాగ్ చేరడంతో మరింత సంతోషాన్ని కలిగించేలా తీర్చిదిద్దాడు దర్శకుడు. మిత్ర మండలి మూవీని బన్నీ వాస్ బీవీ వర్క్స్ కింద సమర్పించారు.
సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ , ప్యాషనేట్ నిర్మాతలు కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప , డాక్టర్ విజయేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఎస్. విజయేందర్ దర్శకత్వం వహిస్తుండగా ఆర్ఆర్ ధ్రువన్ సంగీతం అందించారు.