మోహ‌న్ లాల్ బ‌ర్త్ డే..క‌న్న‌ప్ప గ్లింప్స్ గిఫ్ట్

సినిమా రిలీజ్ కోసం ప్ర‌మోష‌న్స్ షురూ

ఇండియ‌న్ సినిమాకు సంబంధించి టాప్ హీరోలు న‌టిస్తున్న చిత్రం క‌న్న‌ప్ప‌. ఇతిహాసం నేప‌థ్యంగా వ‌స్తోంది. దీనిని టాలీవుడ్ స్టార్ హీరో మంచు మోహ‌న్ బాబు నిర్మాణ సార‌థ్యంలో భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కించారు. సినిమా చిత్రీక‌ర‌ణ దాదాపు పూర్త‌యింది. ఇప్ప‌టికే పోస్ట‌ర్స్, టీజ‌ర్, సాంగ్స్ రిలీజ్ చేశారు. పెద్ద ఎత్తున క్యాంపెయిన్ స్టార్ట్ చేశాడు న‌టుడు మంచు విష్ణు. త‌ను ప్ర‌స్తుతం అమెరికాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాడు.

ఇక క‌న్న‌ప్ప చిత్రంలో మోహ‌న్ బాబు, కాజ‌ల్ అగ‌ర్వాల్, మంచు విష్ణు, అక్ష‌య్ కుమార్, మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇందులో ర‌ఘు బాబు కూడా మ‌రో కీల‌క పాత్ర పోషించాడు. పాన్ ఇండియాగా తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు. ఇక మోహ‌న్ లాల్ కు ఈ ఏడాది అంత‌టా శుభారంభం. త‌ను న‌టించిన సీక్వెల్ మూవీ లూసిఫ‌ర్ సూప‌ర్ స‌క్సెస్ అయ్యింది. అదే స‌మ‌యంలో వ‌చ్చిన మ‌రో మూవీ శోభ‌న‌త్ న‌టించిన చిత్రం కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ప్ర‌తి మూవీ రూ. 200 కోట్ల‌ను వ‌సూలు చేసింది.

ఇప్పుడు మూడో చిత్రంగా మోహ‌న్ లాల్ న‌టించిన క‌న్న‌ప్ప రానుంది ప్రేక్ష‌కుల ముందుకు. ఇదిలా ఉండ‌గా మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ బ‌ర్త్ డే ను పుర‌స్క‌రించుకుని మూవీ మేక‌ర్స్ త‌న పేరుతో క‌న్న‌ప్ప గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. మంచి స్పంద‌న ల‌భిస్తోంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

Comments (0)
Add Comment