Dynamic Actor Mohan Lal :ఆస‌క్తి రేపుతున్న మోహ‌న్ లాల్ ఎంపూర‌న్

ట్రైల‌ర్ రిలీజ్ చేసిన మూవీ మేక‌ర్స్

Mohan Lal : మ‌ల‌యాళంలో అత్యంత జ‌నాద‌ర‌ణ క‌లిగిన‌, డైన‌మిక్ హీరో మోహ‌న్ లాల్. త‌న‌కు ఇచ్చిన ఏ పాత్ర అయినా స‌రే దానికి న్యాయం చేసేంత దాకా నిద్ర పోడు. ఇక మ‌రో అద్భుత‌మైన న‌టుడు, ద‌ర్శ‌కుడు పృథ్వీరాజ్ సుకుమారన్. త‌ను కూడా న‌టించి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తాజా చిత్రం 1.1 ఎంపూర‌న్(Empuraan). ఇప్ప‌టికే విడుద‌లైన చిత్రం లూసీఫ‌ర్. ఇది బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఈ మూవీకి కొన‌సాగింపుగా సీక్వెల్ గా తీసిన చిత్రం ఎంపూర‌న్.

Mohan Lal Empuraan Movie Trailer

ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో సూప‌ర్ గా ఉంది తాజాగా రిలీజ్ అయిన ట్రైల‌ర్. మ‌రోసారి త‌న స‌త్తా ఏమిటో చూపించాడు న‌టుడు మోహ‌న్ లాల్. నాలుగు నిమిషాల కంటే త‌క్కువ నిడివి ఉన్న‌ప్ప‌టికీ మ‌రింత ఆస‌క్తిని రేపేలా తీర్చి దిద్దాడు ద‌ర్శ‌కుడు. ఇందులో మోహ‌న్ లాల్ ఎంట్రీ కెవ్వు కేక అనిపించేలా ఉంది. దీనిని హిందీ, తమిళం, తెలుగు, కన్నడ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్బంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు ద‌ర్శ‌క‌, న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్.

ట్రైల‌ర్ చివ‌ర‌లో మీరు ఎవ‌రు అనే ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చాడు మోహ‌న్ లాల్. మీరు ఎవ‌రు అన్న ప్ర‌శ్న‌కు నేను లూసిఫ‌ర్ అంటాడు. అధికారం, దురాశ, ద్రోహం, ప్రతీకారంతో ఆధిపత్యం చెలాయించే ఎంపురాన్ ప్రపంచాన్ని చూపించేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇక 1.2 ఎంపురాన్ మార్చి 27న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

Also Read : Popular Actress Aishwarya Rejects :క‌ర‌ణ్ జోహార్ ఆఫ‌ర్ ఐశ్వ‌ర్య డోంట్ కేర్

L2 EmpuraanMohan LalTrailer releaseTrendingUpdates
Comments (0)
Add Comment