Hero Mohan Lal-Messi :మెస్సీ బ‌హుమానం మోహ‌న్ లాల్ సంతోషం

సంత‌కం చేసిన జెర్సీని అందుకున్న హీరో

Mohan Lal : మ‌ల‌యాళ సినీ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతున్నాడు. ఎందుకంటే ప్ర‌పంచంలో అత్యున్న‌త‌మైన ఫుట్ బాల్ ఆట‌గాడు మెస్సీ నుంచి అరుదైన బ‌హుమ‌తిని అందుకున్నాడు. స్వ‌యంగా తాను సంత‌కం చేసిన జెర్సీని స్వీక‌రించాడు. ఈ సంద‌ర్బంగా తానే అందుకున్న జెర్సీ ఫోటోను షేర్ చేశాడు. ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇదిలా ఉండ‌గా మోహ‌న్ లాల్(Mohan Lal) కీ రోల్ పోషించిన ఎల్2 ఎంపురాన్ మూవీ ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

Mohan Lal Got Gift from Popular Football Player Messi

ఇది బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. త‌న అద్భుత‌మైన న‌ట‌న‌కు పేరు పొందాడు. ఇందులో త‌న‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమార‌న్ కూడా స్క్రీన్ షేర్ చేశాడు. ఇదిలా ఉండ‌గా తాను జీవితంలో మ‌రిచి పోలేని అనుభూతికి లోనైన‌ట్లు తెలిపాడు న‌టుడు మోహ‌న్ లాల్.
ఇందుకు సంబంధించిన వీడియోను స్వ‌యంగా షేర్ చేశాడు సూప‌ర్ స్టార్. ఈ సంద‌ర్భంగా సామాజిక మాధ్య‌మం ఎక్స్ వేదిక‌గా స్పందించాడు.

జీవితంలో కొన్ని క్ష‌ణాలు మాట‌ల‌కు అంద‌నంత లోతైన‌విగా అనిపిస్తాయని, అవి ఎప్ప‌టికీ త‌న‌ను వీడి పోలేవంటూ పేర్కొన్నారు. ఇవాళ చాలా ఆనందానికి లోన‌వుతున్నా. అంతులేని అనుభూతికి గుర‌య్యానంటూ తెలిపాడు న‌టుడు మోహ‌న్ లాల్. ఆ బహుమ‌తిని సున్నితంగా విప్పుతున్న‌ప్పుడు నా గుండె కొట్టుకోవ‌డం ఆగి పోయింద‌న్నాడు. జెర్సీపై నా పేరును స్వ‌యంగా మెస్సీ రాయ‌డం అదృష్టంగా భావిస్తున్న‌ట్లు తెలిపాడు. ఈ సంద‌ర్బంగా ఆ దేవుడికి ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్న‌ట్లు తెలిపాడు.

Also Read : Hero Rana Daggubati :న‌టుడు రానా ద‌గ్గుబాటికి అరుదైన గౌర‌వం

MessiMohan LalTrendingUpdates
Comments (0)
Add Comment