L2 Empuraan Sensational :రూ. 260 కోట్ల వ‌సూలుతో ఎంపురాన్ రికార్డ్

కొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేసిన న‌టుడు

L2 Empuraan : మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ కీ రోల్ పోషించిన చిత్రం ఎల్ 2 ఎంపురాన్. ఇది గ‌తంలో వ‌చ్చిన , త‌ను న‌టించిన చిత్రం లూసిఫ‌ర్ కు సీక్వెల్. దీనిని న‌టుడు, ద‌ర్శ‌కుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ తీశాడు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో వ‌సూళ్ల‌లో కొత్త ట్రెండ్ ను సృష్టించింది ఈ మూవీ. విమ‌ర్శ‌కుల నోళ్లు మూయిస్తూ ముందుకు వెళుతోంది. దీనిని ద‌ర్శ‌కుడు పూర్తిగా యాక్ష‌న్ , డ్రామాగా తెర‌కెక్కించ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. విడుద‌లైన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ ఏడాది మోహ‌న్ లాల్ న‌టించిన రెండు మూవీస్ విడుద‌ల‌య్యాయి.

L2 Empuraan Sensational Collections

రెండూ బిగ్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. త‌న‌తో పాటు శోభ‌న‌తో క‌లిసి న‌టించిన తుడారుమ్ కూడా క‌లెక్ష‌న్ల‌లో కొత్త ట్రెండ్ సృష్టించింది. ఇది ఏకంగా వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 60 కోట్ల‌ను దాటేసింది. సినీ వ‌ర్గాల‌ను విస్తు పోయేలా చేసింది. ఇక ఎల్ 2 ఎంపురాన్(L2 Empuraan) ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను క‌ట్టి ప‌డేలా చేసింది. ఇందులో మంజు వారియ‌ర్ , టోవోనో థామ‌స్ , వెంజ‌ర‌మూడు, ఇంద్ర‌జిత్ సుకుమార‌న్ ల‌తో పాటు సూర‌జ్ న‌టించాడు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ , గోకులం సినిమాస్ క‌లిసి ఆంథోనీ పెరుంబూర్ నిర్మించారు ఎల్ 2 ఎంపురాన్ మూవీని.

సినిమా విష‌యానికి వ‌స్తే ద‌ర్శ‌కుడు సుకుమార‌న్, న‌టుడు మోహ‌న్ లాల్ ఎలాంటి రెమ్యూన‌రేష‌న్ తీసుకోకూడ‌ద‌ని ముందే ఒప్పందం చేసుకున్నారు. సినిమా రిలీజ్ అయ్యాక వ‌చ్చే లాభాల‌లో భాగం పంచుకుందాని నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్పుడు, న‌టుడు, డైరెక్ట‌ర్ల పంట పండింది. కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. ఎంపురాన్ వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 260 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. అత్య‌ధికంగా వ‌సూలు చేసిన మ‌ల‌యాళ మూవీగా రికార్డ్ సృష్టించింది.

Also Read : AR Rahman Sensational :దుమ్ము రేపుతున్న జింగుచా రెహ‌మాన్ సాంగ్

CinemaCollectionsL2 EmpuraanMohan LalTrending
Comments (0)
Add Comment