విజయవాడ : మెప్పా, డ్వాక్రా సంఘాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానస పుత్రికలు అని అన్నారు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని). డ్వాక్రా మహిళలను అభివృద్ది పరిస్తే… ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్తను తయారు చేయాలన్న సీఎం ఆశయం త్వరగా సాధ్యమవుతుందని అన్నారు. విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాలకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సమాఖ్య రిసోర్స్ పర్సన్స్ కు ట్యాబ్ ల పంపిణీ చేశారు.
మెప్పా ఆధ్వర్యంలో జరిగిన ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా 500 మంది ఆర్.పిలకు 35 వేల రూపాయలు విలువ చేసే ట్యాబ్ లు
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడారు. ప్రభుత్వానికి డ్వాక్రా సంఘాలకు ఆర్.పిలు వారధిగా వున్నారంటూ వారి సేవలను కొనియాడారు. సీఎం చంద్రబాబు పనులు వేగవంతంగా అయ్యేందుకు సమూలంగా డిజిటిలైజేషన్ కోసం మార్పులు చేస్తున్నారని, అందులో భాగంగానే ఆర్.పి లకు ట్యాబ్ లు అందించటం జరుగుతుందన్నారు. పట్టణ పేదరిక నిర్మూలిన సంస్ధ మెప్పా విభాగం ద్వారా డ్వాక్రా సంఘాల అభివృద్ది కార్యక్రమ నిర్వహణ కోసం పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్ లకు దిశా నిర్ధేశం చేశారు.
ప్రజల దైనందిన జీవితంలో ప్రజలకు అవసరమైన విషయాలు ఆలస్యంగా కాకుండా త్వరితగతిన ప్రభుత్వానికి తెలియ జేయటం కోసం, ఆ విషయాలను తక్షణం అమలు చేయటం కోసం ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ సీఎం చంద్ర బాబు ప్రారంభించారని తెలిపారు.
డ్వాక్రా మహిళలు సిల్క్ డెవలప్మెంట్ సెంటర్స్, కామన్ పెసిలిటీ సెంటర్స్ తమ సొంత నిధులతో ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. చాలా మంది రుచిగా, శుచిగా పచ్చళ్లు తయారు చేస్తారు కానీ ప్యాకింగ్ బాగోదు..కామన్ పెసిలిటీ సెంటర్ లో ప్యాకింగ్ ఏర్పాటు చేయటంతో పాటు ఉచితంగా మార్కెటింగ్ సదుపాయం ఏర్పాటు చేస్తామన్నారు. స్కిల్ డెవలప్ సెంటర్, కామన్ ఫెసిలిటీ, మార్కెటింగ్ ఈ మూడు కూడా డ్వాక్రా మహిళలకు అందించగలిగితే అభివృద్ది సాధించటమే కాదు…మహిళ సాధికారత సాధిస్తారన్నారు. ఆ తర్వాత కుటుంబానికో వ్యాపారవేత్త తయారు చేయటం సులువుగా మారుతుందన్నారు.
ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఉచితంగా మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు ప్రణాళిక సిద్దం చేశారని, సింగ్ నగర్ లో డ్వాక్రా బజార్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన జరుగుతుందన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా పశ్చిమ నియోజకవర్గం, తూర్పు నియోజకవర్గాలతో పాటు, ఇబ్రహీంపట్నం నందిగామ, జగ్గయ్యపేట జాతీయ రహదారులపై డ్వాక్రా బజార్లు ఏర్పాటు చేసే విషయం కలెక్టర్ తో చర్చించటం జరిగిందన్నారు. డ్వాక్రా బజార్లు లో రోటేషన్ పద్దతిలో నాలుగైదు రోజుల పాటు ఉచితంగా ప్రొడక్ట్స్ అమ్ముకునే అవకాశం కల్పిస్తామన్నారు. ఈ బజార్లో అరకు కాఫీ తోపాటు, కొండపల్లి బొమ్ములు కూడా ఏర్పాటు చేస్తామన్నారు.