Beauty Nabha Natesh : న‌భా న‌టేష్ ఫోటోస్ వైర‌ల్

కాంక్రీట్ జంగిల్లో రాధ సెన్సేష‌న్

Nabha Natesh : హీరోయిన్ న‌భా న‌టేష్ సంచ‌ల‌నంగా మారింది. త‌ను న‌టించింది కొన్ని చిత్రాలే అయిన‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అప్ డేట్స్ ఇస్తూ వ‌స్తోంది. త‌న అభిమానుల‌ను మెస్మ‌రైజ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ‌. డైన‌మిక్ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన రామ్ పోతినేని న‌టించిన ఇస్మార్ట్ శంక‌ర్ లో త‌ళుక్కున మెరిసింది. ఆ త‌ర్వాత ఈ అమ్మ‌డు కొంత గ్యాప్ ఇచ్చింది. అయితే ఈ మ‌ధ్య‌నే ఎందుకు దూరంగా ఉంటూ వ‌చ్చార‌ని ఫ్యాన్స్ అడిగిన ప్ర‌శ్న‌కు కీల‌క స‌మాధానం ఇచ్చింది.

Nabha Natesh Photos Viral

త‌న‌కు అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యింద‌ని, అందుకే న‌టించేందుకు ఛాన్స్ ఉన్నా ఇబ్బంది ఏర్ప‌డింద‌న్నారు. తాజాగా న‌భా న‌టేష్(Nabha Natesh) కాంక్రీట్ జంగిల్ రాధగా స్టిల్స్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల‌ను షేక్ చేస్తున్నాయి. అయితే త‌న కెరీర్ ప్ర‌స్తుతం ఎత్తుప‌ల్లాల మ‌ధ్య కొన‌సాగుతోంది. కొన్ని హిట్ కాగా మ‌రికొన్ని నిరాశ ప‌రిచాయి.

ప్ర‌స్తుతం న‌భా న‌టేష్ చేతిలో రెండు సినిమాల‌కు ఓకే చెప్పింద‌ని టాక్. ఇందులో ఒక‌టి యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ తో క‌లిసి స్వ‌యంభూ మూవీలో న‌టించ‌నుంది. విరాట్ క‌ర్ణ హీరోగా న‌టిస్తున్న నాగ‌బంధం చిత్రంలో కీ రోల్ పోషిస్తోంది. త‌న‌కు న‌చ్చిన పాత్ర‌లు వ‌స్తే న‌టించేందుక తాను ఎల్ల‌ప్ప‌టికీ సిద్దంగా ఉంటాన‌ని స్ప‌స్టం చేసింది ఈ ల‌వ్లీ బ్యూటీ. మొత్తంగా న‌భా న‌టేష్ తాజాగా షేర్ చేసిన పిక్స్ మాత్రం కెవ్వు కేక అనేలా ఉన్నాయి.

Also Read : Hero Ajith-Good Bad Ugly :గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ఓటీటీలో రెడీ

Indian ActressNabha NateshUpdatesViral
Comments (0)
Add Comment