Darling OTT : ఓటీటీలోకి నభా నటేష్ నటించిన రొమాంటిక్ సినిమా ‘డార్లింగ్’

ప్రియదర్శి, నభ నటేష్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా డార్లింగ్...

Darling : ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది సినిమాలను థియేటర్స్ లోనూ ఓటీటీల్లోనూ ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్స్‌లో ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు.. ఇప్పుడు ఓటీటీలో సినిమాలను ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే థియేటర్స్ లో రిలీజ్ అయినా నెలరోజులకు ఓటీటీల్లోకి వస్తున్నాయి కొత్త సినిమాలు. కొన్ని సినిమాలు వారాల్లోనే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఇక ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ సినిమా కూడా ఓటీటీలో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. ఆ సినిమా మరేదో కాదు యంగ్ బ్యూటీ నభా నటేష్(Nabha Natesh) నటించిన డార్లింగ్ సినిమా. చాలాకాలం తర్వాత నభా నటేష్ బిగ్ స్క్రీన్ పై మెరిసిన సినిమా ఇది.

Darling OTT Updates

ప్రియదర్శి, నాభ నటేష్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా డార్లింగ్. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ జూలై 19న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మిక్స్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. థియేటర్స్ లో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ ఈ సినిమాలో నభా నటేష్ తన నటనతో ఆకట్టుకుంది. ఈ అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీఫ్ల‌స్ హాట్ స్టార్‌ సొంతం చేసుకుంది. ఆగస్టు 15న ఈ డిస్నీఫ్ల‌స్ హాట్ స్టార్‌ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ, హిందీ భాష‌ల్లో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. ఇక డార్లింగ్ సినిమాలో నభానటేష్ మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్న పాత్రలో నటించింది. ఆమె భర్తగా ప్రియదర్శి ఆకట్టుకున్నాడు. అలాగే ఈ సినిమాలో అనన్య నాగళ్ల కీలకపాత్రలో కనిపించింది. థియేటర్స్ లో పెద్దగా ఆకట్టుకొని ఈ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను మెప్పిస్తుందేమో చూడాలి.

Also Read : VD12 Movie : గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రౌడీ బాయ్ నటించిన చిత్రం నుంచి న్యూ లుక్

CinemaDarlingNabha NateshOTTTrendingUpdates
Comments (0)
Add Comment