Naga Chaitanya : ఈ ఏడాది అక్కినేని నాగ చైతన్యకు శుభారంభాన్ని ఇచ్చింది. దీంతో మనోడు దూకుడు పెంచాడు. కొన్నాళ్లుగా సినిమాలు ఆడక, లేక తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. మరో వైపు వ్యక్తిగత జీవితం కూడా తనను పరేషాన్ కు గురి చేసింది. నటి సమంత రుత్ ప్రభుతో విడి పోయాడు. మరో నటి శోభిత ధూలిపాళను పెళ్లి చేసుకున్నాడు. దాదాపు సుదీర్ఘ కాలం పాటు తను తండేల్ మూవీ కోసం కేటాయించాడు. తను చేసిన కష్టానికి మంచి ఫలితం దక్కింది. ఇందులో అద్భుతంగా నటించింది సాయి పల్లవి. తను సహజ నటిగా పేరు పొందింది.
Naga Chaitanya Movie Updates
ప్రేక్షకుల ముందుకు వచ్చిన తండేల్ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. సంగీత, దర్శకత్వం, నటనా పరంగా మంచి మార్కులే పడ్డాయి. చిత్ర బృందానికి సంతోషాన్ని మిగిల్చింది. ప్రత్యేకించి అక్కినేని నాగ చైతన్యకు(Naga Chaitanya) తన కెరీర్ లో అద్బుతమైన మూవీగా నిలిచి పోయింది. దీంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు నటుడు. ఈ మూవీ ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్ లోకి చేరడం విస్తు పోయేలా చేసింది. సినీ వర్గాలు సైతం తండేల్ గొప్ప మూవీ అంటూ కితాబు కూడా ఇచ్చేశారు.
ఈ చిత్రం ఇచ్చిన బూస్ట్ తో నాగ చైతన్య మరో మూవీపై ఫోకస్ పెట్టాడు. కథ నచ్చడంతో దర్శకుడు కార్తీక్ వర్మ దండుకు ఓకే చెప్పాడు. గతంలో దీనిని అధికారికంగా ప్రకటించారు మూవీ మేకర్స్. ఇవాళ షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు. ఇది ఏకంగా రూ. 100 కోట్లకు పైగానే రూపుదిద్దు కోనుంది. ఈ డైరెక్టర్ ఎవరో కాదు ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడు కావడం విశేషం. మరో శిష్యుడు బుచ్చిబాబు సన ఉప్పెనను సక్సెస్ చేశాడు. రామ్ చరణ్ తో పెద్ది తీస్తున్నాడు.
Also Read : New Song Sensational :సింగిల్ గా ఉంటే బతుకంతా సిరాకే