Naga Chaitanya : ఈ ఏడాది బాగా కలిసొచ్చింది యువ హీరో అక్కినేని నాగ చైతన్యకు. స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభుతో విడాకులు పొందడం, మరో నటి శోభిత ధూళిపాళతో వవాహం జరిగి పోయింది. ఈ తరుణంలో తను నటించిన తండేల్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆశించిన దానికంటే ఎక్కువగా జనాదరణ పొందింది. సూపర్ కలెక్షన్స్ సాధించింది. ఈ మూవీ రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసింది. కథతో పాటు సంగీత పరంగా తండేల్ కు ప్లస్ పాయింట్ అయ్యింది. దీంతో దూకుడు పెంచాడు నాగ చైతన్య(Naga Chaitanya).
Naga Chaitanya Movie Updates
పలువురు దర్శకుల నుంచి కథలు విన్నాడు. ఇప్పటికే విరూపాక్ష సినిమాతో సూపర్ టాక్ అందుకున్న దర్శకుడు కార్తీక్ వర్మ దండు ప్రాజెక్టుకు ఓకే చెప్పాడు. ఇందుకు సంబంధించి తాజాగా కీలక అప్ డేట్ ఇచ్చాడు. షూటింగ్ కూడా ప్రారంభమైందంటూ ప్రకటించాడు. పక్కా వీడియోను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. దీంతో ఈ కొత్త మూవీని పూర్తిగా మిథికల్ థ్రిల్లర్ గా రూపొందించనున్నట్లు తెలిసి పోయింది. టాలీవుడ్ లో దర్శక, నిర్మాతల గురించి, స్టార్ హీరో హీరోయిన్ల గురించి పట్టించు కోవడం లేదు. పూర్తిగా కంటెంట్ బాగుంటునేనే ఆదరిస్తున్నారు. లేదంటే పక్కన పెడుతున్నారు.
ఇందుకు తాజా ఉదాహరణగా చెప్పవచ్చు. మెగాస్టార్ తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన , శంకర్ తీసిన గేమ్ ఛేంజర్. ఇది బొక్క బోర్లా పడింది. పూర్తిగా తన కెరీర్ లో డిజాస్టర్ గా నిలిచింది. ఇదే సమయంలో దీంతో పాటే విడుదలైన బాబ్జీ తీసిన బాలయ్య నటించిన డాకు మహారాజ్, విక్టరీ వెంకటేశ్, ఐశ్య రాజేష్, మీనాక్షి చౌదరి కలిసి నటించిన సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. బాలయ్య మూవీ 130 కోట్లు వసూలు చేస్తే వెంకీ మూవీ రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది. సో దీనిని గమనించిన చైతూ కంటెంట్ ప్రాధాన్యత ఉన్న కథకే మొగ్గు చూపాడు.
Also Read : Hero Allu Arjun-Desamuduru :మే 10న బన్నీ దేశముదురు రీ రిలీజ్