Naga Shaurya : వరుడు కావలెను లాంటి ఫీల్ గుడ్ మూవీలో నటించి మంచి మార్కులు కొట్టేసిన యంగ్ టాలెంటెడ్ కలిగిన హీరో నాగ శౌర్య కీ రోల్ పోషిస్తున్న తాజా చిత్రం బ్యాడ్ బాయ్ కార్తీక్. దర్శకుడు రామ్ దశీనా దీనిని అద్భుతంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు ప్రకటించారు నిర్మాతలు . సామాజిక వేదిక ఎక్స్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. శ్రీ వైష్ణవి ఫిలిం పతాకంపై బ్యాడ్ బాయ్ కార్తీక్ ను నిర్మించారు. ఎక్కడా రాజీ పడలేదని స్పష్టం చేశారు.
Naga Shaurya ‘Bad Boy’ Movie Updates
అంచనాలకు మించి సినిమా మీ ముందుకు రాబోతోంది. షూటింగ్ పూర్తయింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి స్తాయిలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు . ఫస్ట్ లుక్ ను మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేశారు. దీనికి ఆశించిన దానికంటే సూపర్ రెస్పాన్స్ వచ్చిందన్నారు ప్రొడ్యూసర్.
బ్యాడ్ బాయ్ కార్తీక్ చిత్రంలో నటుడు నాగ శౌర్యతో(Naga Shaurya) పాటు అందాల తార విధి కథానాయికిగా నటిస్తోంది. తమిళ సినీ రంగానికి చెందిన విలక్షణ నటుడు, దర్శకుడు సముద్రఖని ఇందులో వరదా రెడ్డి అనే పేరుతో నటిస్తుండడం విశేషం. తనతో పాటు సీనియర్ నటులు సాయి కుమార్, సీనియర్ నరేష్, వెన్నెల కిషోర్ ఇతర పాత్రలు పోషించారు. సంగీతం హరీశ్ జయరాజ్ చేయగా సినిమాటోగ్రఫీ రసూల్ ఎల్లోర్ నిర్వహించారు. చాన్నాళ్ల తర్వాత హరీశ్ ఈ మూవీకి మ్యూజిక్ ఇవ్వడం విశేషం.
Also Read : Rowdy Boy – Kingdom :కింగ్ డమ్ మూవీ జూలై 4కి వాయిదా