Namratha Shirodkar Sensational :మ‌రిన్ని మ‌ద‌ర్స్ మిల్క్ బ్యాంకులు రావాలి

పిలుపునిచ్చిన న‌టి న‌మ్ర‌తా శిరోద్క‌ర్

Namratha Shirodkar : తెలుగు రాష్ట్రాల‌లో మ‌రిన్ని మ‌ద‌ర్స్ మిల్క్ బ్యాంకులు ఏర్పాటు కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు ప్ర‌ముఖ న‌టి న‌మ్ర‌తా శిరోద్క‌ర్(Namratha Shirodkar). విజ‌య‌వాడ‌లోని ఆంధ్రా హాస్పిట‌ల్స్ లో త‌ల్లి పాల బ్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె గుండె శస్త్ర చికిత్స చేయించుకున్న పిల్లలను పరామర్శించారు. తల్లి పాలు అందుబాటులో లేని శిశువులకు సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ పాల బ్యాంకును ఏర్పాటు చేయ‌డం ప‌ట్ల ఆనందం వ్య‌క్తం చేశారు. కొంద‌రు మ‌హిళ‌లు త‌మ అందం చెడి పోతుంద‌ని పిల్ల‌ల‌కు పాలు ఇవ్వ‌డం లేద‌ని వాపోయారు న‌టి.

Namratha Shirodkar Comment about Mothers Milk Bank

ఇదిలా ఉండ‌గా గత 10 సంవత్సరాలుగా మహేష్ బాబు ఫౌండేషన్ 4,500 మందికి పైగా పిల్లలకు గుండె శస్త్రచికిత్సలు చేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు న‌మ్ర‌తా శిరోద్క‌ర్. పిల్లల ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచడానికి ఫౌండేషన్ సేవలను విస్తరించ‌నున్న‌ట్లు తెలిపారు. ఇదిలా ఉండ‌గా ఏపీలో ఇదే మొట్ట‌మొద‌టి మ‌ద‌ర్ మిల్క్ బ్యాంక్ కావ‌డం ఇదే.

కీలకమైన జాగ్రత్తలు తీసుకుంటూనే తల్లులు పాలు ఉత్పత్తి చేయని శిశువులకు కీలకమైన సహాయాన్ని అందించే మదర్స్ మిల్క్ బ్యాంక్ సెంటర్‌ను ప్రారంభించడం గౌరవంగా ఉందన్నారు. అదనంగా 2025 నాటికి 1,500 మంది బాలికలకు టీకాలు వేయాలనే లక్ష్యంతో 9 నుండి 18 సంవత్సరాల వయస్సు గల బాలికలకు గర్భాశయ క్యాన్సర్ టీకా కార్యక్రమాన్ని తాము ప్రారంభిస్తున్నామ‌న్నారు.

Also Read : Hero Ram Charan-Dhoni :రామ్ చ‌ర‌ణ్ మూవీలో క్రికెట‌ర్ ధోనీ

CommentsNamratha ShirodkarViral
Comments (0)
Add Comment