Hit 3 : శైలేష్ కొలను దర్శకత్వం వఃహించిన చిత్రం హిట్ 3(Hit 3). ఎవరూ ఊహించని రీతిలో వసూళ్ల పర్వం కొనసాగిస్తోంది. నేచురల్ స్టార్ నాని, కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి కీ రోల్స్ పోషించారు. నిన్నటి దాకా నేచురల్ స్టార్ గా పేరు పొందిన నాని ఉన్నట్టుండి మరింత వయెలెంట్ గా తయారయ్యాడు. అందరినీ ఆశ్చర్య పోయేలా చేశాడు. కథ నచ్చితే చాలు కొత్త వారిని ఎంకరేజ్ చేస్తూ వస్తున్న నాని మెస్మరైజ్ చేశాడు.
Hero Nani-Hit 3 Movie Updates
తన నటనతోనే కాదు నిర్మాతగా కూడా. ఈ ఏడాది తనకు మంచి శుభారంభం ఇచ్చిందని చెప్పక తప్పదు. దీనికి కారణంగా తాను తొలిసారిగా నిర్మించిన చిత్రం కోర్ట్. ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ ఏకంగా ఓటీటీ కోసం రూ. 8 కోట్లు చెల్లించి స్వంతం చేసుకుంది. ఇప్పుడు తను ముఖ్య భూమికను పోషించిన హిట్ -3 కలెక్షన్ల వేట కొనసాగిస్తోంది. కేవలం 4 రోజుల్లోనే రూ. 100 కోట్ల మార్క్ ను దాటేసింది. రూ. 200 కోట్ల క్లబ్ లోకి దూసుకు వెళుతోంది.
శైలేష్ కొలను పూర్తిగా హింసాత్మకంగా తెర మీద నానిని చూపించాడు. హిట్ -3 లో నానిని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఇమిడి పోయేలా చేశాడు. విచిత్రం ఏమిటంటే హింసకు దూరంగా ఉండే ఫ్యామిలీ స్ సైతం హిట్ -3ని చూస్తుండడం పట్ల సినీ వర్గాలు ఒకింత విస్మయం వ్యక్తమైంది. మొత్తంగా నాని తాను మామూలోడిని కానని దమ్మున్న నటుడినంటూ నిరూపించుకున్నాడు. త్వరలో తన నుంచి ప్యారడైజ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : Hero Aamir Khan-Atlee :అట్లీ మూవీలో విలన్ గా అమీర్ ఖాన్ ..?