Hit 3 : శైలేష్ కొలను దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ -3(Hit 3) మూవీ దుమ్ము రేపుతోంది. ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ కలెక్షన్ల పరంగా దూసుకు పోతోంది. కలెక్షన్ల పంట పండిస్తోంది. దీంతో హిట్ మూవీ మేకర్స్, నిర్మాతలు ఫుల్ జోష్ లో ఉన్నారు. సక్సెస్ సంబురాలలో మునిగి పోయారు. హింస ఎక్కువై పోయిందన్న అపవాదు తప్పితే సినిమాను సూపర్ గా తెరకెక్కించే ప్రయత్నం చేశాడని సినీ విమర్శకులు పేర్కొంటున్నారు. తొలి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 20.25 కోట్లు వసూలు చేయగా 2వ రోజు మరో రూ. 10 కోట్లు వసూలు చేసి విస్తు పోయేలా చేసింది.
Hit 3 Collections
హిట్ 3ని యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించాడు. బాక్సాఫీస్ వద్ద జోరుగా కొనసాగుతోంది. పలు భాషలలో దీనిని రిలీజ్ చేశారు. మూవీని తెలుగు, కన్నడ, తమిళం, హిందీ , మలయాళ వెర్షన్లతో రూపొందించారు. ఇక తెలుగు వారు ఎక్కువగా ఆదరిస్తుండడం విశేషం. సినిమా ప్రమోషన్ లో భాగంగా నాని చెన్నై, ముంబై, తదితర ప్రాంతాలలో ప్రమోషన్స్ చేశాడు. మొత్తం ఆక్యుపెన్సీ 52.37 శాతం , ఉదయం షోలు 34 శాతం ఆక్యుపెన్సీ గా నమోదైంది. మధ్యాహ్నం, సాయంత్రం షోలలో దాదాపు 55 శాతానికి పెరిగింది.
ఇక రాత్రి షోలలో ఆల్ టైమ్ 66 శాతంగా ఉంది. తమిళనాడులో 24.41 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.
మొత్తంగా రాబోయే రోజుల్లో హిట్ 3 మూవీ రూ. 50 కోట్లను దాటడం ఖాయమని అంచనా వేస్తున్నారు మూవీ మేకర్స్. ఇందులో నాని కనికరం లేని పోలీస్ ఎస్పీ అర్జున్ సర్కార్ గా పాత్ర పోషించాడు. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందించాడు కొలను. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి, సూర్య శ్రీనివాస్ , రావు రమేష్, బ్రహ్మాజీ ముఖ్య పాత్రల్లో నటించాడు.
Also Read : Hero Prabhas-Deepika :వంగా మూవీలో ప్రభాస్..దీపికా పదుకొనే