Navdeep: రేవ్‌ పార్టీలో నా పేరు లేనందుకు కొందరు నిరుత్సాహపడ్డారేమో – నవదీప్‌

రేవ్‌ పార్టీలో నా పేరు లేనందుకు కొందరు నిరుత్సాహపడ్డారేమో - నవదీప్‌

Navdeep: టాలీవుడ్ తో పాటు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన బెంగుళూరు రేవ్ పార్టీపై హీరో నవదీప్ ఆశక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. ఇటీవల ఎక్కడైనా సినీ పరిశ్రమకు చెందిన వారు రేవ్ పార్టీ, డ్రగ్స్ కేసులో పట్టుపడితే వారిలో ముందు నవదీప్ పేరు వినిపించేంది. తాను డ్రగ్స్ తీసుకున్నట్లుగాని, సరఫరా చేస్తున్నట్లు గాని ఇప్పటి వరకు ఎప్పుడూ ఎక్కడా పూర్తి ఆధారాలు లేనప్పటికీ… ఆయన పేరు మాత్రం తరచూ డ్రగ్స్ కేసులో వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో తన ‘లవ్‌ మౌళి’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న నవదీప్(Navdeep)… బెంగళూరు రేవ్‌ పార్టీకి తాను వెళ్లినట్టు రూమర్స్‌ రాకపోవడంతో చాలామంది నిరుత్సాహపడి ఉంటారని చురకలు వేసారు. అంతేకాదు ‘ఏంటన్నా… ఈసారి నువ్వు ఫేక్‌ న్యూస్‌ లో కనిపించడంలేదు’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా పలువురు అభిమానులు అడుగుతున్నారని ఆయన తెలిపారు.

Navdeep Commet

ఇదే విషయంపై తన కొత్త సినిమా ‘లవ్‌ మౌళి’ ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ప్రెస్‌మీట్‌లో రేవ్‌ పార్టీ గురించి ప్రశ్న ఎదురవగా ఆయన స్పందించారు. ‘చిత్ర పరిశ్రమకు సంబంధించి ఇలా ఏదైనా అంశం సంచలనంగా మారితే… మీపై ఆరోపణలు వచ్చేవి. ఈసారి రాలేదు’ అంటూ విలేకరి ప్రస్తావించగా… మంచే జరిగిందని… ఈ ఒక్కసారి నన్ను వదిలేశారని నవ్వుతూ సమాధానాలిచ్చారు. రేవ్‌ పార్టీ అంటే… రేయి, పగలు జరిగేదని ఓ ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. ఆ పార్టీ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుందన్నారు. రొమాంటిక్‌ డ్రామాగా అవనీంద్ర తెరకెక్కించిన ‘లవ్‌ మౌళి’లో భావన సాగి హీరోయిన్‌. ఈ మూవీ జూన్‌ 7న విడుదల కానుంది.

Also Read : Vikram: అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన కమల్ హాసన్ ‘విక్రమ్‌’ !

Bangalore Rave PartyNavdeep
Comments (0)
Add Comment