Nayanathara : న‌య‌న్ జ‌వాన్ సెన్సేష‌న్

షారుక్ తో పోటా పోటీగా న‌ట‌న

Nayanathara : చెన్నై – బాలీవుడ్ లో బాద్ షాగా పేరు పొందిన షార‌క్ ఖాన్ తో న‌టించాలంటే ఎంత ద‌మ్ముండాలి. ఎంత తెగువ కావాలి. ఎక్క‌డా త‌గ్గ‌లేదు. పోటా పోటీగా న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది త‌మిళ సినీ రంగానికి చెందిన న‌య‌న‌తార‌.

Nayanathara Got Appreciations

ఆమె న‌టించిన తాజా చిత్రం జ‌వాన్ దుమ్ము రేపుతోంది. కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. క్రియేటివ్, డైన‌మిక్ డైరెక్ట‌ర్ అట్లీ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లై దూసుకు పోతోంది. ఎక్క‌డ చూసినా స్టార్ బాద్ షాతో పాటు న‌య‌న‌తార కు కూడా అభిమానులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.

యాక్ష‌న్, థ్రిల్ల‌ర్, రొమాన్స్ , డ్యాన్సులు ఇలా ప్ర‌తి దానిలోనూ ఎక్క‌డా షారుక్ ఖాన్ తో త‌గ్గ‌కుండా న‌టించింది..మెప్పించింది న‌య‌నతార‌(Nayanathara). ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఆమె వైర‌ల్ గా మారింది. ఫ్యాన్స్ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

ఇక న‌య‌న‌తారతో పాటు ల‌వ్లీ గర్ల్ దీపికా ప‌దుకొనే స్పెష‌ల్ అప్పియ‌రెన్స్ జ‌వాన్ కు అద‌న‌పు బ‌లాన్ని ఇచ్చింది. ఇక త‌మిళ సినీ విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌లో మెప్పించాడు. త‌న‌కు ఎదురే లేద‌ని చాటాడు. మొత్తంగా జ‌వాన్ స‌క్సెస్ తో అటు అట్లీ ఇటు ఎస్ఆర్కే ఫుల్ జోష్ లో ఉన్నారు. బాద్ షాకు ఇది రెండో సినిమా బ్లాక్ బస్ట‌ర్ కావ‌డం.

Also Read : Atlee Kumar : బాద్ షా వ‌ల్ల‌నే జ‌వాన్ స‌క్సెస్

Comments (0)
Add Comment