Nayanthara : అలాంటి వారితో వాదించడం వల్ల మీ సమయం వృధా

Nayanthara : తాజాగా నయనతార సోషల్‌ మీడియాలో చేసిన ఓ పోస్ట్‌ ఎంతగా వైరల్‌ అయిందో తెలిసిందే! ఆ పోస్ట్‌ పెద్ద చర్చకు దారి తీసింది. మందార పువ్వుతో చేసిన టీ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటూ నయనతార పెట్టిన పోస్ట్‌ విమర్శలు రావడంతో ఆమె ఆ పోస్ట్‌ను తొలగించింది. తాజాగా ఇన్‌స్టాలో ఆసక్తికర సందేశాన్ని షేర్‌ చేసింది. ‘‘ తెలివి తక్కువ వారితో వాదించవద్దు. ఆ విధంగా మిమ్మల్ని వారి స్థాయికి తీసుకువెళ్లి, ఓడిస్తారు’ అని అమెరికన్‌ రైటర్‌ మార్క్‌ ట్వైన్‌ సూక్తిని షేర్‌ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. తనని విమర్శించిన వారిని ఉద్దేశించే ఈ విధంగా నయన పోస్ట్‌ పెట్టారని భావిసున్నారు నెటిజన్లు.

Nayanthara Comment

కొంతకాలంగా ఇన్స్టా గ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటున్న నయన్(Nayanthara) తన అభిప్రాయాలను షేర్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మందారపువ్వులతో చేేస టీ గురించి పోస్ట్‌ పెట్టారు. ఆ టీ తనకెంతో ఇష్టమని చెప్పారు. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని తెలిపారు. రోగ నిరోధక శక్తిని పెరుగుతుందని.. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఇది ఉపశమనం కలిగిస్తుందన్నారు. నయనతార పోస్ట్‌పై ఓ డాక్టర్‌ స్పందించాడు. ుది లివర్‌ డాక్టర్‌ అనే ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ పెట్టాడు. 8.7 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను ఆమె తప్పుదోవ పట్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆమె మాటల్లో నిజం లేదని పేర్కొన్నాడు. ఆయన ట్వీట్‌ వైరల్‌గా మారడంతో నయనతార తన పోస్ట్‌ను తొలగించారు.

Also Read : Paradha Movie : అనుపమ పరమేశ్వరన్ నటించిన ‘పరదా’ సినిమా నుంచి కీలక అప్డేట్

BreakingCommentsNayantharaViral
Comments (0)
Add Comment