Nayanthara : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మినిమం గ్యారెంటీ కలిగిన దర్శకుడు అనిల్ రావిపూడి. తను పూర్తిగా కామెడీ, ఎంటర్ టైనర్ జానర్ ను ఎంచుకున్నాడు. కథ బలంగా ఉంటే సినిమా సక్సెస్ కావడం పక్కా అనేది గ్యారెంటీ. కళ్యాణ్ రామ్ ఛాన్స్ ఇవ్వడంతో సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న డైరెక్టర్ దుమ్ము రేపాడు. తను స్టార్ హీరోలతో మూవీస్ తీశాడు. రవితేజ, మహేష్ బాబు, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్ లతో టాప్ సినిమాలను తీశాడు.
Nayanthara-Chiranjeevi Movie Updates Viral
తాజాగా ఈ ఏడాది తన దర్శకత్వం వహించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది. చరిత్ర సృష్టించింది. ఇందులో విక్టరీ వెంకీతో పాటు ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి కీ రోల్స్ పోషించారు. అనూహ్యంగా జనం ఆదరించడం విస్తు పోయేలా చేసింది. ఇదే సమయంలో కీలక ప్రకటన చేశాడు. మెగాస్టార్ చిరంజీవితో తాను సినిమా చేస్తున్నట్లు స్పష్టం చేశాడు. ఇంకా పేరు ఖరారు చేయలేదు. కథ నచ్చడంతో ఓకే చేశాడు స్టార్ హీరో.
దీంతో మెగాస్టార్ తో ఏ హీరోయిన్ నటిస్తుందనే దానిపై ఉత్కంఠకు తెర దించాడు. ఈ సందర్బంగా పలువురు హీరోయిన్ల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందాల ముద్దుగుమ్మ త్రిష కృష్ణన్ ఓకే అయ్యిందని ప్రచారం జరిగింది. తాజాగా మరో వార్త వినిపించింది. అదేమిటంటే తమిళ సినీ రంగానికి చెందిన టాప్ హీరోయిన్ , లేడి అమితాబ్ బచ్చన్ గా గుర్తింపు పొందిన నయనతార(Nayanthara) కూడా మెగాస్టార్ సరసన నటించనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
Also Read : Natural Star Nani-Hit-3 :రూ. 100 కోట్ల క్లబ్ లోకి నాని హిట్ 3