మే 29 నుంచి ఓటీటీలో హిట్ -3 మూవీ

రూ. 100 కోట్లు వ‌సూలు చేసిన చిత్రం

శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం హిట్ -3 . ఇందులో నేచుర‌ల్ స్టార్ నానితో పాటు శాండిల్ వుడ్ న‌టి ముఖ్య పాత్ర పోషించింది. త‌ను ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన కేజేఎఫ్ లో న‌టించింది. ఇక ఇటీవ‌లే విడుద‌లైన హిట్ -3ని ప్రేక్ష‌కులు ఆదిరించారు. ఊహించ‌ని రీతిలో సినిమా క‌లెక్ష‌న్స్ ఏకంగా రూ. 100 కోట్లు దాటడంతో సినీ వ‌ర్గాలు విస్తు పోయాయి. ఈ సినిమా ఈ మే నెల 1న ముందుకు వ‌చ్చింది. త‌క్కువ బ‌డ్జెట్ తో తీసిన ఈ చిత్రం మంచి స‌క్సెస్ కావ‌డంతో ఈ ఏడాది ఫుల్ ఖుష్ లో ఉన్నాడు నాని.

ఎందుకంటే ఓ వైపు సినిమాల‌లో న‌టిస్తూనే ఇంకో వైపు నిర్మాత‌గా కూడా మారాడు. త‌ను తీసిన కోర్ట్ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఇది కూడా సూప‌ర్ క‌లెక్ష‌న్స్ సాధించింది. ఏకంగా ఓటీటీ సంస్థ రూ. 8 కోట్ల‌కు కొనుగోలు చేసింది. హిట్ -3 బిగ్ స‌క్సెస్ టాక్ తెచ్చు కోవ‌డంతో ఓటీటీలో విడుద‌ల చేసేందుకు రెడీ అయ్యింది. మంచి స్పంద‌న రావ‌డం, భారీ ఎత్తున వ‌సూళ్లు చేయ‌డంతో ఇందు కోసం ఓటీటీ సంస్థ‌లు పోటీ ప‌డ్డాయ‌ని, చివ‌ర‌కు దిగ్గ‌జ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఎక్కువ ధ‌ర‌కు కొనుగోలు చేసిన‌ట్లు స‌మాచారం.

దీంతో స‌ద‌రు సంస్థ అధికారికంగా సామాజిక వేదిక ద్వారా ప్ర‌క‌టించింది. నాని న‌టించిన హిట్ -3 మీ ముందుకు స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్దంగా ఉంది. మే 29న అందుబాటులోకి వ‌స్తుంది. ఆద‌రించండి. పూర్తిగా ఎంజాయ్ చేయండి అంటూ కోరింది నెట్ ఫ్లిక్స్ సంస్థ‌.

Comments (0)
Add Comment