కమల్ హాసన్ , సిలాంబరసన్ , త్రిష కృష్ణన్ కీలక పాత్రలు పోషించిన చిత్రం థగ్ లైఫ్. ఇప్పటికే చిత్రానికి సంబంధించి పోస్టర్స్, టీజర్, సాంగ్స్ కు మంచి ఆదరణ లభించింది. మూవీ రిలీజ్ తేదీని కూడా ఖరారు చేశారు. జూన్ 5న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రకటించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది.
భారీ అంచనాల మధ్య వస్తోంది థగ్ లైఫ్. ఈ సినిమాకు ప్రత్యేకత ఉంది. ఈ సినిమాకు కథ కమల్ హాసన్ అందించాడు. అంతే కాకుండా ఓ పాట కూడా రాశాడు. ఇది బిగ్ హిట్ గా నిలిచింది. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మ్యూజిక్ ఇచ్చాడు అల్లా రఖా రెహమాన్.
థగ్ లైఫ్ ను చేజిక్కించుకునేందుకు ఓటీటీ దిగ్గజ సంస్థలు నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియో హాట్ స్టార్, జీ5 పోటీ పడ్డాయి. చివరకు నెట్ ఫ్లిక్స్ కైవసం చేసుకుంది. భారీ ధరకు తీసుకున్నట్లు సమాచారం. ప్రత్యేకించి దక్షిణాది సినిమాలకు హెవీ డిమాండ్ ఉంటోంది. రిలీజ్ అయ్యాక నాలుగు వారాల తర్వాత ఓటీటీల్లోకి స్ట్రీమింగ్ చేయాలనేది రూల్.
సినిమాలు బ్లాక్ బస్టర్ అయినా సరే స్ట్రీమింగ్ కష్టమే. ఇదిలా ఉండగా రెట్రో సూర్య మూవీని స్ట్రీమింగ్ తేదీని మార్చారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించాడు. ఇందులో లవ్లీ బ్యూటీ పూజా హెగ్డే కీ రోల్ పోషించింది. ఈ సందర్బంగా తన సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కమల్ హాసన్. థగ్ లైఫ్ నెట్ ఫ్లిక్స్ ను కొనుగోలు చేసిందన్నారు. సంస్థకు ధన్యవాదాలు తెలిపారు.