Niharika Konidela : ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమా పవర్ స్టార్ ఫ్యాన్ తీసిందే..

పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే జాతర చుట్టూ ఈ కథను రాసుకున్నాడు యదు వంశీ...

Niharika Konidela : మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై తెరకెక్కిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. సినిమాపై పాజిటివ్ వైబ్స్‌ ఏర్పడేలా చేశాయి.

ఈ క్రమంలో గురువారం చిత్ర నిర్మాత నిహారిక కొణిదెల(Niharika Konidela) మీడియాకు ఈ చిత్ర విశేషాలను తెలియజేశారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘ఈ ‘కమిటీ కుర్రోళ్ళు’ కథ విన్నాక ఈ చిత్రంలో నా పేరు మాత్రం కనిపించాలని అనుకున్నాను. ఫీచర్ ఫిల్మ్ చేయాలని అనుకున్న టైంలో అంకిత్ ద్వారా ఈ కథ నా దగ్గరకు వచ్చింది. మ్యూజిక్‌తో పాటుగా ఈ కథను నాకు వినిపించారు. అనుదీప్ అప్పటికే మ్యూజిక్ చేసేశారు. సిటీలో పుట్టి పెరిగిన నేను జాతర ఎక్స్‌పీరియెన్స్ చేయలేదు. కానీ నాకు కళ్లకు కట్టినట్టుగా వంశీ చూపించాడు. నెరేషన్ అద్భుతంగా ఇచ్చాడు. ఓటీటీలో అయినా థియేటర్లో అయినా సినిమా మేకింగ్ ప్రాసెస్ ఒకటే. అందుకే ఈ కథను ఎలాగైనా నిర్మించాలని నేను ఫిక్స్ అయ్యాను.

Niharika Konidela Comment

పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే జాతర చుట్టూ ఈ కథను రాసుకున్నాడు యదు వంశీ. మూడు తరాలను చూపించేలా ఈ కథ ఉంటుంది. వంశీ పర్సనల్ ఎక్స్‌పీరియెన్స్‌లు కూడా ఇందులో ఉన్నాయి. వంశీ.. కళ్యాణ్ బాబాయ్ అభిమాని. 2019 ఎన్నికల ప్రచార టైంలో జరిగిన విషయాలను కూడా ఇందులో తన స్టైల్లో, కాస్త సెటైరికల్‌గా చూపించారు. టాలెంట్ మాత్రమే కాదు.. క్రమశిక్షణ ఉంటేనే ఇండస్ట్రీలో ఎదుగుతారని చిరంజీవి పెదనాన్న చెబుతుంటారు. ఆ క్రమశిక్షణ నేను వంశీలో చూశాను. ఆయన సినిమా కోసం చాలా కష్టపడ్డారు. మా నాన్నకి కూడా వంశీ నెరేషన్ ఇచ్చారు. మామూలుగానే మా నాన్నకి నచ్చకపోతే వెంటనే లేచి వెళ్లిపోతారు.

కానీ వంశీ చెప్పిన కథ మా నాన్నకి కూడా చాలా బాగా నచ్చింది. మా అన్నా, వదినలు సినిమాను చూశారు. వాళ్లకి సినిమా చాలా నచ్చింది. బయటి వాళ్ల పొగడ్తలు, క్రిటిసిజం పట్టించుకోను. మా అన్న ఎప్పుడూ స్ట్రెయిట్ ఫార్వార్డ్‌గా చెప్పేస్తుంటారు. ఈ మూవీ చూసి వెంటనే నన్ను పిలిచి అభినందించారు. సెన్సార్ వాళ్లకి కూడా సినిమా బాగా నచ్చింది. ఈ సినిమాకు ‘కమిటీ కుర్రోళ్లు(Committee Kurrollu)’ అనే టైటిల్‌ను ముందే ఫిక్స్ చేశారు. నాకు కమిటీ కుర్రోళ్లు అంటే ఏంటో తెలియదు. పండుగలు, పబ్బాలు, గొడవలు ఇలా ఏది ఉన్నా కమిటీ కుర్రాళ్లే ముందుంటారని వంశీ చెప్పారు.

Also Read : Pawan Kalyan: సినిమా హీరోలపై పవన్‌ కళ్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు ! అల్లు అర్జున్ కోసమేనా ?

CinemaCommittee KurrolluNiharika KonidelaTrendingUpdatesViral
Comments (0)
Add Comment