Nilave : ప్రేక్షకులను కట్టి పడేసేవి సెంటిమెంట్స్, వినోదం, కుటుంబాల మధ్య అనుబంధాలను తెరపై ఆవిష్కరిస్తే చాలు సినిమాలను ప్రేక్షకులు బ్రహ్మ రథం పడతారు. అంతే కాదు సాహిత్యానికి, భావోద్వేగాలకు, ఫీల్ గుడ్ కలిగిన పాటలు , సంగీతం ఉంటే చాలు వద్దన్నా థియేటర్ల వద్దకు వస్తారు. ఈ మధ్యన టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ కొనసాగుతోంది. కొందరు దర్శకులు, నిర్మాతలు, హింస, సెక్స్ , బూతు డైలాగ్ లను , వల్గర్ పాటలను నమ్ముకున్నారు. మీరు చూస్తున్నారు అందుకే మేం తీస్తున్నామంటూ కబుర్లు చెబుతున్నారు. ఇక ఓటీటీలు, సోషల్ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
Nilave Movie Updates
బూతు రాజ్యం ఏలుతోంది. హింసాత్మక, సెక్స్ తో కూడిన సినిమాలు వచ్చినా జనం వాటిని ఆదరించడం లేదు. పక్కన పెట్టేస్తున్నారు. స్టార్లు ఉన్నా, కథ బాగో లేక పోతే వెంటనే బాగోలేదని చెప్పేస్తున్నారు. ఈ తరుణంలో కథా పరంగా బాగుంటే ప్రేక్షకులే స్వయంగా ప్రమోషన్ చేస్తున్నారు. ఆ కోవలోకి వచ్చిందే పక్కా తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉన్న నిలవే(Nilave). ఈ సినిమాకు సంబంధించి టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బిగ్గెస్ట్ మ్యూజికల్ డ్రామాగా దీనిని రూపొందించారు. అయితే ఇందులో ప్రత్యేకత ఉంది ఈ మూవీ టీంకు. వీరి గురించి పెద్దగా సినీ ఇండస్ట్రీలో తెలియదు.
కానీ సినిమా అంటే పిచ్చి. అంతకు మించి ప్రాణం. దాని మీద ఉన్న వ్యామోహమే నిలమే సినిమా తీసేందుకు దోహద పడేలా చేసింది. శ్రేయాస్ సేన్ , సౌమిత్ రావు ముఖ్య పాత్రలు పోషించారు. సాయి వెన్నెం, సౌమిత్ రావు దర్శకత్వం వహించారు. పీఓవీ ఆర్ట్స్ వ్యూ ప్రొడక్షన్స్ పతాకంపై తాహెర్ సినీ టెక్ సౌజన్యంతో సాయి వెన్నెం, గిరిధర్ రావు దీనిని నిర్మించారు. ఒంటరితనంతో గడుపుతున్న హీరోకు అనుకోకుండా తారస పడుతుంది శ్రేయాస్ సేన్. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ పండిందా . ఇద్దరూ కలిసి ప్రయాణం చేసేందుకు సిద్ద పడ్డారా అనేది తెలుసు కోవాలంటే నిలమే చూడాలి.