Niram Marum Ulagil : తమిళ సినీ పరిశ్రమలో సృజనాత్మకతకు పెట్టింది పేరు భారతీరాజా. తను దర్శకుడిగానే కాదు నటుడు కూడా. తాజాగా తాను నటించిన చిత్రం నిరం మారుమ్ ఉలగిల్(Niram Marum Ulagil) ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్దమైంది. ఏప్రిల్ 25న రానుందని ప్రకటించారు. దీంతో సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సమాజంలో ఎదురయ్యే సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూనే వాటికి పరిష్కార మార్గాలు చూపించే దమ్మున్న దర్శకుడిగా గుర్తింపు పొందాడు భారతీరాజా. నిరం మారుమ్ ఉలగిల్ తమిళ నాటకం తల్లిదండ్రుల త్యాగాన్ని ఇది ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంది.
Niram Marum Ulagil OTT Updates
ఈ చిత్రం గత మార్చి నెల 7వ తేదీన బిగ్ స్క్రీన్స్ లలో రిలీజ్ అయ్యింది. మిశ్రమ స్పందన వచ్చింది. ఒకే కథలో నాలుగు కథలను చొప్పించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. చాలా మంది దీని గురించి భావోద్వేగాలను తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారంటూ పేర్కొన్నారు. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దమైంది. ఏప్రిల్ 25వ తేదీన స్ట్రీమింగ్ చేస్తామంటూ సంస్థ అధికారిక ఎక్స్ ఖాతాలో స్పష్టం చేసింది. దీంతో ఎప్పుడు చూడాలనే ఉత్కంఠ నెలకొంది ప్రేక్షకులలో.
ఇందులో ప్రధానంగా అనారోగ్యం, ఊహించని సంబంధాలు, విడి పోవడం, భావోద్వేగ కల్లోలం వంటి సవాళు, కుటుంబ బాంధవ్యాలు, బంధాలను తెర మీద చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఈ మూవీలో నాలుగు కథలు ఉన్నాయి. వాటిని మూవీగా తీశాడు. ముంబై, వేలంకన్ని, చెన్నై, తిరుత్తణి ప్రాంతాల ప్రాతిపదికగా ఇవి రూపుదిద్దుకున్నాయి. నిరం మారుమ్ ఉలగిల్ చిత్రంలో దర్శకుడు, నటుడు భారతీరాజా, రియో రాజ్, శాండీ మాస్టర్, యోగిబాబు, నట్టి సుబ్రమణియం, ఆర్జేవిగ్నేశ్కాంత్ , కనిహ, రిషికాంత్, తదితరులు నటించారు. దీనికి బ్రిట్జో జెబి రచించి దర్శకత్వం వహించాడు.
Also Read : Hero Silambarasan :త్వరలోనే పెళ్లి చేసుకుంటానన్న సిలాంబరసన్