Hero Nithin Movie :మూడ్ ఆఫ్ త‌మ్ముడు గూస్ బంప్స్

శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో నితిన్

Nithin : ఈ ఏడాది వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం రాబిన్ హుడ్. ఇందులో న‌టించిన నితిన్(Nithin) కు వ‌ర్క‌వుట్ కాలేదు. శ్రీ‌లీల త‌ళుక్కున మెరిసినా మూవీ డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఈ త‌రుణంలో మ‌రో చిత్రంతో ముందుకు వ‌స్తున్నాడు యంగ్ హీరో. మూడ్ ఆఫ్ త‌మ్ముడు పేరుతో సినిమా పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేస్తూ పోస్ట‌ర్ , వీడియోను రిలీజ్ చేశారు. దీనికి శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

Hero Nithin Thammudu Movie Updates

ఈ చిత్రంలో అల‌నాటి అందాల తార ల‌య చాన్నాళ్ల త‌ర్వాత రీ ఎంట్రీ ఇస్తోంది ఈ త‌మ్ముడు చిత్రం ద్వారా. ఆమెతో పాటు వ‌ర్ష బొల్ల‌మ్మ‌, స‌ప్త‌మి గౌడ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా మూవీ మేక‌ర్స్ కీల‌క అప్ డేట్ ఇచ్చారు. త‌మ్ముడు చిత్రాన్ని వ‌చ్చే జూలై 4న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కొత్త‌గా ప్ర‌యోగం చేశారు. సినిమాలోని పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేశారు ఇందులో. దీనికి మూడ్ ఆఫ్ త‌మ్ముడు అని పేరు పెట్టారు.

స‌ప్త‌మి గౌడ ర‌త్న పాత్ర‌లో, స్వ‌సిక గుత్తి, సౌర‌భ్ స‌చ్ దేవ్ అగర్వాల్ , చిత్ర‌గా వ‌ర్ష , ఝాన్సీ కిర‌ణ్మ‌యిగా ల‌య న‌టించ బోతున్నారు. ఇక సినిమాలో కీ రోల్ పోషిస్తున్న నితిన్ రెడ్డి చివ‌ర‌గా విడిచిన బాణం ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ఉత్కంఠ రేపుతుంద‌ని చెప్ప‌డంలో త‌ప్పులేదు. త‌మ్ముడు మూవీకి అజనీష్ ఇచ్చిన బీజీఎం కెవ్వు కేక అనిపించేలా ఉంది. శ్రీ‌రామ్ వేణు గ‌తంలో ఎంసీఏ, ప‌వ‌న్ తో వ‌కీల్ సాబ్ తీశాడు. ఇప్పుడు నితిన్ తో తీస్తున్నాడు త‌మ్ముడు పేరుతో.

Also Read : Javed Akthar Shocking :జావేద్ అక్త‌ర్ షాకింగ్ కామెంట్స్

CinemaNithinTammuduUpdatesViral
Comments (0)
Add Comment