Nithya Menen: విజయ్‌ సేతుపతి సరసన నిత్యా మీనన్‌ ?

విజయ్‌ సేతుపతి సరసన నిత్యా మీనన్‌ ?

Nithya Menen: హీరోగానే కాకుండా విలన్ గానూ కనిపించి… తనదైన శైలి నటనతో ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న కోలీవుడ్ నటుడు విజయ్‌ సేతుపతి. తమిళం, తెలుగు, హిందీ అని తేడా లేకుండా అన్ని భాషల్లో అటు హీరోగా, ఇటు విలన్ గా ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఉప్పెన వంటి తెలుగు స్ట్రైయిట్ సినిమాలతో పాటు… మాస్టర్, విక్రమ్, జవాన్ వంటి డబ్బింగ్ సినిమాల్లో తన నట విశ్వరూపం చూపించారు. ఇటీవల ‘మహారాజ’ సినిమాతో తన నట విశ్వరూపంతో పాటు బాక్సాఫీసు సత్తాను చాటారు. దీనితో విజయ్ సేతుపతి ఏ కొత్త ప్రాజెక్టు ప్రారంభించినా పాన్ ఇండియా రేంజ్ లో అంచనాలు పెరిగిపోతున్నాయి.

Nithya Menen Movie Updates

మరోవైపు అందం, అభినయం పరంగా తెలుగు ప్రేక్షకుల్లోనూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మలయాళ బ్యూటీ నిత్యా మీనన్‌(Nithya Menen). ఎంచుకున్న ప్రతీ పాత్రలోనూ తన సహజమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుంటుంది. ఇటీవలే ఉత్తమ నటిగా జాతీయ అవార్డును దక్కించుకొని అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇప్పుడీమె మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. తాజాగా ఈమె, విజయ్‌ సేతుపతితో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. పాండిరాజ్‌ దీన్ని తెరకెక్కిస్తున్నారు.

‘‘ఇంకా పేరు పెట్టని ఈ సినిమా చిత్రీకరణను ఇటీవలే ప్రారంభించింది చిత్రబృందం. మరికొన్ని రోజుల్లో ఈ షూటింగ్‌లో పాల్గొననుంది నిత్యా మీనన్. ఇందులో విజయ్‌ కి జోడీగా కనిపించునుందామె. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. త్వరలో ఈ ప్రాజెక్టు గురించి అధికారికంగా ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నారని చిత్ర సన్నిహిత వర్గాల సమాచారం. దీనితో ఇద్దరు నేషనల్ అవార్డు నటులు ఈ సినిమాకు కలిసి పనిచేయడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

Also Read : Krithi Shetty: చిరంజీవితో సినిమాపై క్లారిటీ ఇచ్చిన ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి !

Nithya MenenVijay Sethupathi
Comments (0)
Add Comment