Hero Vijay Sethupathi-Nivetha :విజ‌య్ సేతుప‌తి స‌ర‌స‌న నివేదా థామ‌స్

పూరీ జ‌గ‌న్నాథ్ మూవీలో ముఖ్య పాత్ర‌లో

Vijay Sethupathi : ఈ సంద‌ర్బంగా విజ‌య్ సేతుప‌తి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. త‌ను క‌థ‌ల‌ను చూస్తాన‌ని, త‌న క్యారెక్ట‌ర్ ఏ మేర‌కు ప్రేక్ష‌కుల ద‌గ్గ‌ర‌కు తీసుకు వెళుతుంద‌నే కోణంలో ఆలోచిస్తాన‌ని, అవ‌త‌ల ద‌ర్శ‌కుడు ఫెయిల్ అయ్యాడా లేక స‌క్సెస్ సాధించాడా అనే దానిని తాను ప‌ట్టించుకోనంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టాడు. త‌ను చేసిన కామెంట్స్ తో ఒక్క‌సారిగా సినీ ఇండ‌స్ట్రీలో విజ‌య్ సేతుపతిపై మ‌రింత గౌర‌వం పెంచేలా చేసింది. అంతే కాదు త‌న‌కు కూతురు లాంటి హీరోయిన్ తో ఛాన్స్ వ‌చ్చినా చేయ‌న‌ని చెప్పేశాడు. సినిమా అనేది ప్ర‌జ‌ల‌కు మేలు చేకూర్చేలా, ఆలోచించేలా, ఆనందం క‌లిగించేలా ఉండాలి కానీ మ‌న వ్య‌క్తిగ‌త ప్ర‌చారం కోసం కాద‌న్నాడు.

Nivetha Thomas Got Key role in Vijay Sethupathi Movie

ఇక తాజాగా పూరీ జ‌గ‌న్నాథ్(Puri Jagannadh), విజ‌య్ సేతుప‌తి మూవీలో హీరోయిన్ గా ఎవ‌రు న‌టిస్తున్నార‌నే దానిపై రోజుకో వార్త చక్క‌ర్లు కొడుతోంది టాలీవుడ్ లో. దీనిని పాన్ ఇండియా లెవ‌ల్లో తీస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు పూరీ. ఇద్ద‌రు లేదా ముగ్గురు హీరోయిన్ల‌ను సంప్ర‌దించాడ‌ని, ఒక పాత్ర‌లో ట‌బు న‌టిస్తుంద‌ని, ఇంకో పాత్ర కోసం హీరోయిన్ గా నివేదా థామ‌స్ ను ఎంపిక చేసిన‌ట్లు టాక్. ఏది ఏమైనా ఆమె ఎంపికకు సంబంధించి ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు పూరీ జ‌గ‌న్నాథ్. త‌ను ఏది చేసినా ఓ సంచ‌ల‌న‌మే. ఈ ఇద్ద‌రి కాంబోలో వ‌చ్చే మూవీ కోసం ఫ్యాన్స్ ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు.

Also Read : Hero Chiranjeevi-Anil Ravipudi :మెగాస్టార్ అనిల్ రావిపూడి మూవీలో న‌య‌న్..?

CinemaNivetha Thomaspuri jagannadhUpdatesVijay SethupathiViral
Comments (0)
Add Comment