Beauty Tamannaah Odela 2 vs Kesari :వేస‌వి వేళ సినిమాలు క‌ళ‌క‌ళ‌

కేస‌రి 2 వ‌ర్సెస్ ఓదెల 2

Odela 2 : టాలీవుడ్, బాలీవుడ్ మ‌ధ్య పోటీ మ‌రింత పెరుగుతోంది. ప్ర‌ధానంగా ఈ వారంలో కీల‌క‌మైన సినిమాలు విడుద‌ల కానున్నాయి. దీంతో ప్రేక్ష‌కులు ఎవ‌రికి బ్ర‌హ్మ ర‌థం ప‌డుతార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. ప్ర‌ధానంగా కంటెంట్ ప‌రంగా బాగున్న వాటికే ప‌చ్చ జెండా వేస్తార‌నేది స‌హ‌జం. ఇక ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ కార‌ణంగా ప్రేక్షకుల సంఖ్య త‌గ్గింది. ఎంత మంచి , ద‌మ్మున్న సినిమాలు విడుద‌లైనా జ‌నం ప‌ట్టించు కోరు. ప్ర‌త్యేకించి అన్ని వ‌ర్గాల వారు క్రికెట్ ప‌ట్ల ఎక్కువ‌గా ఇష్ట ప‌డ‌తారు. దీంతో సినీ నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు తాము తీసిన మూవీస్ ను విడుద‌ల చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు.

Odela 2 vs Kesari Chapter 2

అయినా ధైర్యం చేసి కొన్ని సినిమాల‌ను విడుద‌ల చేసేందుకు మొగ్గు చూపించారు. ఏప్రిల్ 18న నందమూరి క‌ల్యాణ్ రామ్, విజ‌య‌శాంతి క‌లిసి న‌టించిన అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతి రానుంది. ఇదే రోజున సంజ‌య్ ద‌త్ న‌టించిన కేస‌రి 2 రానుంది. ఇందులో స్టార్ బాబా పాత్ర‌ను పోషిస్తుండ‌డం విశేషం. ఇందులో మౌని రాయ్ దెయ్యం పాత్ర పోషిస్తుండ‌డం విశేషం. పురుషుల‌ను టార్గెట్ చేస్తుంది. ఇందులో అక్ష‌య్ కుమార్ కీల‌క పాత్ర పోషించాడు. బ్రిటిష్ రాజ్‌పై పోరాడిన సి. శంకరన్ నాయర్ పాత్రలో ఒదిగి పోయాడు.

ఇదే స‌మ‌యంలో న‌టి త‌మ‌న్నా భాటియా భిన్న‌మైన రోల్ ను పోషించిన చిత్రం ఓదెల‌2(Odela 2) . ఇందులో సాధువుగా న‌టించింది. ఇది సీక్వెల్ గా వ‌స్తోంది. ఆధ్యాత్మిక థ్రిల్ల‌ర్ గా తీర్చిదిద్దాడు ద‌ర్శ‌కుడు. దీనికి అశోక్ తేజ డైరెక్ష‌న్ చేశాడు. వేస‌వి కాలంలో విడుద‌లైన మ‌రో చిత్రం జాక్. ఇది డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఒక్క గుడ్ బ్యాడ్ అగ్లీ కు మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. కాగా ఓదెల ను 18న విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. కానీ క‌ళ్యాణ్ రామ్ మూవీ ఉండ‌డంతో ఒక రోజు ముందుగానే 17న రానుంది.

Also Read : Chourya Patham Interesting :ఆస‌క్తి రేపుతున్న చౌర్య పాఠం 

Kesari 2Odela 2UpdatesViral
Comments (0)
Add Comment